నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ
ఆగిరిపల్లి:
మండలంలోని అడవినెక్కలం లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా అడవినెక్కలం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను వైద్య అధికారి జాస్తి జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవడం ద్వారా పిల్లల్లో రక్తహీనత తగ్గించడంతోపాటు, శారీరక, మానసిక పెరుగుదల ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ
నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ ఆగిరిపల్లి: మండలంలోని అడవినెక్కలం లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా అడవినెక్కలం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులకు నులిపురుగుల మాత్రలను వైద్య అధికారి జాస్తి జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవడం ద్వారా పిల్లల్లో రక్తహీనత తగ్గించడంతోపాటు, శారీరక, మానసిక పెరుగుదల ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.

