చిట్వేలి సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి)
రాపూర్ రోడ్డులోని తిమ్మాయపాలెం క్రాస్ వద్ద గల శ్రీశ్రీశ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ స్వామి ఆశ్రమంలో నల్లప్ప (రిటైర్డ్ ఏఈఓ, వ్యవసాయశాఖ) గారి వర్ధంతి సందర్భంగా విశేష కార్యక్రమం నిర్వహించారు.మన చిట్వేల్ గ్రామానికి చెందిన రమాదేవి తండ్రిగారు, బెంగళూరులో స్థిరపడిన మూర్తి, చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యము, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ధూప దీప నైవేద్య సామాగ్రి అందజేయడంతో పాటు మధ్యాహ్న భోజన ప్రసాదం ఏర్పాటు చేశారు.
బెంగళూరులో నివసిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆశ్రమంలోని వృద్ధులు ఆనందం వ్యక్తం చేశారు. నల్లప్ప గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ గారు మాట్లాడుతూ—“ఇంటి వద్ద శుభకార్యాలు జరిగినప్పుడు వృద్ధులకు అండగా ఉండే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలి” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటసుబ్బయ్య, నాగలక్ష్మమ్మ, పద్మావతమ్మ, నిర్వాహకుడు చంద్రశేఖర్ తోటి మిత్రులు ఆత్మారెడ్డి, కోటి, నరసింహులు పాల్గొన్నారు.


