తాడివాండ్లపల్లె ప్రజలకు సహాయ సహకారాలు అందించిన వై ఎస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి
రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు మండలం విపిఆర్ కండ్రిక పంచాయతీ అయ్యవారిపల్లి తాడివాండ్లపల్లె పల్లె చుట్టుపక్కల ఉన్న వాగులు వంకలు చెరువులు నిండి ఆ నీళ్లంతా ఊరు మీద ప్రవహించడంతో అక్కడ ఉన్న ప్రజలు ఆందోళన చెందినారు గతవారం నుంచి పడుతున్న వర్షంకు అధికారులు స్పందించకపోవడంతో గ్రామ ప్రజలు వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి కి సమాచారం చెప్పగానే వెంటనే ఆయన స్పందించి అక్కడికి కావలసిన జెసిబిలు ట్రాక్టర్లు పంపించి పొంగి పోరులుతున్న నీటిని చెరువులకు కాలువలకు మళ్లించడం జరిగినది. వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజ రెడ్డి మీ కు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నేను చేస్తానని మాట ఇవ్వడం జరిగినది. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రజలందరూ కలసి రామిరెడ్డి ధ్వజారెడ్డి నీ అభినందించడం జరిగినది ఆయనకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము అని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కుoచెం హరి వార్డు మెంబర్ ,పలిగల వెంకటేశు, చంటి, నాగరాజు, కిరణ్ మొదలగువారు పాల్గొన్నారు.


