పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 నాగర్ కర్నూల్ జిల్లా
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ప్రశాంత్ నగర్ లో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు కోసం తండ్లాట
అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు దిగిన ప్రశాంత్ నగర్ గ్రామస్తులు
మన్ననూరు వద్ద శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహిస్తున్న గ్రామస్తులు.
భారీగా నిలిచిపోయిన వాహనాలు ట్రాఫిక్ జామ్
నీళ్ల కోసం ధర్నాకు దిగిన వారిని అడ్డుకుంటున్న పోలీసులు
పండుగ పూట సైతం నీళ్లు లేక అవస్థలు పడ్డామంటున్న మహిళలు
తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామంటున్న గ్రామస్తులు
ఓట్ల కోసం ఇంటింటికి తిరుగుతారు ఇప్పుడు ఎవరు రావట్లేదు అంటున్న గ్రామ ప్రజలు
ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ప్రజలు
పోలీసులతో వాగ్వాదానికి దిగిన మహిళలు
మాకు తాగునీటి సమస్య మీరు పరిష్కరిస్తారా అంటూ పోలీసులను నిలదీస్తున్న మహిళలు


