డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నుండి గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారి ఆదేశాల ప్రకారం, జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు లో ఉధృతంగా కొనసాగుతున్న వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజల భద్రత, విద్యార్థుల రక్షణ మరియు పాఠశాలల పరిసర ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను పరిశీలించి, స్థానిక స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని అన్ని మండల విద్యాశాఖాధికారులకు సూచనలు జారీ చేయబడినవి.
స్థానిక పరిస్థితులు తీవ్రంగా ఉండి, విద్యార్థులు పాఠశాలకు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటే, సంబంధిత మండల విద్యాశాఖాధికారి స్థానిక మండల రెవెన్యూ అధికారి (తహసీల్దార్)తో సంప్రదించి, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలకు తాత్కాలిక సెలవులు ప్రకటించవచ్చును.
అవసరమైతే 27.10.2025, – 28.10.2025, మరియు 29.10.2025 తేదీలలో పాఠశాలలను మూసివేయవచ్చునని గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారు స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం పూర్తిగా స్థానిక పరిస్థితులను బట్టి తీసుకోవలసి ఉండగా, ప్రతి మండల విద్యాశాఖాధికారి తహసీల్దార్‌తో సమన్వయం చేసుకొని నిర్ణయం తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సూచించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు అధికారిక ప్రకటనలను గమనించాలని తెలిపారు.
జిల్లా విద్యాశాఖాధికారి,
డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం


