అక్టోబర్ 01 (పున్నమి ప్రతినిధి)
ఆసియా కప్ 2025 విజేతగా నిలిచిన టీమ్‌ఇండియాకు రూ.21 కోట్ల ప్రైజ్‌మనీని బీసీసీఐ ప్రకటించింది. ఈ నగదు మొత్తాన్ని ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్‌కి కూడా అందజేస్తామని తెలిపింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తిలక్ వర్మ అద్భుతంగా ఆడి, 69 నాటౌట్ (53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో భారత్‌ను 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయవంతం చేశాడు. భారత్ ఇది తొమ్మిదోసారి ఆసియా కప్‌ను గెలుచుకోవడం విశేషం. ఈ టోర్నీలో టీమ్‌ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించడం గర్వకారణంగా మారింది. మొత్తం ప్రదర్శనలో టీమ్ ఇండియా ప్రాబల్యాన్ని స్పష్టంగా చూపింది.


