జాతీయ స్థాయికి యస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థిలు ఎంపిక
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరుకు చెందిన ఎస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఈ నెల 15,16 వ తేది కాకినాడలో ఆంధ్ర ప్రదేశ టైక్వాండోఅసోసియేషన్ నీర్వహించిన 39వ సబ్ – జూనియర్, 8th క్యాడట్, 41st సీనియర్స్ రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలు నిర్వహించారు . ఇందులో రైల్వేకోడూరు పట్టణం లో ఉన్న యస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన సీనియర్స్ విభాగంలో ఎం.చైతన్య ప్రసాద్, జె. నాగమణి. బంగారు పథకాలు సాధించారు సబ్ -జూనియర్ విభాగంలో పి.నాగ చరణ్. జి. అభి రామ్ సాయి వర్మ .బంగారు పథకాలు సాధించారు. క్యాడట్ బాలుల విభాగంలో పి. శ్రీరామ్, ఎ. రామ్ చరణ్ బాలికల విభాగంలో పి. హర్షిత, కె. నిహారిక బంగారు పతకాలు సాధించారు, వరుణ్ కుమార్ , వర్ష(శ్రీ, సుమయ వెండి పథకాలు సాధించారని కోచ్ శివాజీ తెలిపారు . రాష్ట్ర స్థాయిలో బంగరు పతకాలు సాధించిన 8 మంది ఈ నెల 21 నుండి26 వ తేదీలలో పంజాబ్ లో జరగబోయే జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికయినట్లు తెలిపారు, అలాగే సీనియర్స్ విభాగంలో డిసెంబర్ నెలలోహైదరాబాద్ లో జరగభోయే జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికయినట్లు విలేకర్ల సమావేశంలో తెలిపారు.


