సెప్టెంబర్ 9, పున్నమి ప్రతినిధి, జనగాం:
కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా జడ్పిహెచ్ఎస్ ఏడునూతులలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సృజనాత్మకంగా, విభిన్న రకాల అద్భుతమైన టీ.ఎల్.ఎమ్ (TLM)లను తయారు చేసి ప్రదర్శించారు. అదనంగా నృత్యాలు, ప్రసంగాలు, పాటలు, వక్తృత్వాలతో తెలుగు భాషా మహత్యాన్ని ప్రతిబింబించారు.
తెలుగు ఉపాధ్యాయురాలు ఎం.రజిత మాట్లాడుతూ — “తెలుగు భాష మన బతుకుబండి, మన సంస్కృతి శ్వాస. భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం” అని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.
ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొన్నారు.


