Sunday, 7 December 2025
  • Home  
  • చరిత్రలో శ్రీనివాస మంగాపురం
- Featured - ఆంధ్రప్రదేశ్ - సాహితీ

చరిత్రలో శ్రీనివాస మంగాపురం

తనివితీరా స్వామివారిని దర్శించుకోవాలంటే మంగాపురం వెళ్లాల్సిందే ప్రతి యేటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో బ్రహ్మోత్సవాలు నిలువెత్తు వేంకటేశ్వరుని విగ్రహం ఈ ఆలయం ప్రత్యేకత. వేంకటాద్రి పర్వతానికి సమానమైనది బ్రహ్మాండలోకాల్లో లేదనని, శ్రీవారికి సమానమైన దేవుడు గతంలో కాని, భవిష్యత్‌లో కాని ఉండరని పెద్దలంటారు. అంతటి మహిమగల భగవానుణ్ణి దర్శించుకోవడం అంత తేలిక విషయం కాదు. వ్యయ ప్రయాసల సంగతులటుంచి, తృప్తి తీరా దర్శనం చేసుకునే వీలువుండదు. గంటల కొద్ది క్యూలో నిలబడ్డ తర్వాత దర్శనం లభించేది కొద్ది క్షణాలు మాత్రమే. ఆ క్షణాల్లోనే భక్తులకు అనిర్వచనీయమైన అలౌకికానందం కలుగుతుంది. పడిన శ్రమంతా మరిచిపోతారు. మళ్ళీ ఎప్పుడు దర్శన భాగ్యం కలుగుతుందా? అని ఎదురుచూస్తుంటారు. వీలు చిక్కగానే మళ్ళీ తిరుమలకు ప్రయాణం కడుతుంటారు. అయితే తృప్తిదీరా వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే మార్గం వుంది. అదేమంటే వేంకటాద్రి పర్వతాన్ని తాకుతున్నట్టుగా శ్రీవారి పాదాల చెంత, శ్రీవారికి ప్రతి రూపంగా వున్న కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వుంది. మూలవిరాట్టు ముందు నిలబడి నిలువెత్తు సుందర మైన ఆ విగ్రహాన్ని ఎంత సేపైనా దర్శించుకోవచ్చు. అదే శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం. శ్రీపద్మావతిదేవితో నారాయణ వనంలో వివాహం జరిగిన పిమ్మట ఈ ప్రాంతంలో శ్రీనివాసుడు కొంత కాలం నివసించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. పరిణయ అనంతరం కళ్యాణ వేంకటేశ్వరుడైన శ్రీవారు పద్మావతితో కలిసి వస్తూ తొండవాడ ఆశ్రమంలో వున్న ఆగస్త్య మహామునిని దర్శించారు. అగస్త్యుని దర్శించుకున్న నవ దంపతులు కొండ ఎక్కడానికి వెళ్తుండగా అగస్త్యుడు పసుపు గుడ్డలతో కొండ ఎక్క కూడదని చెప్పాడు. అగస్త్యుని సలహా ప్రకారం ఆ కొత్త దంపతులు శ్రీనివాసమంగా పురం అనే ప్రాంతంలో ఆరు మాసాల పాటు నివసించారు. ఈ ‌సమయంలో వారు ప్రతి రోజు అగ స్త్యుని దర్శించుకునే వారు. గడువు పూర్తయిన పిమ్మట శ్రీవారు నడిచి వెళ్ళి తిరుమల చేరా రు. శ్రీనివాసుడు నివసించిన ఈ ప్రాంతం తర్వాత శ్రీనివాస మంగాపురం అయింది. అంతకు ముందు దాని పేరు సిద్దకూటమి. శ్రీవారు కొండపైకి నడిచిన దారి శ్రీవారి మెట్టు అయింది. కళ్యాణం తర్వాత ఆయన ఇక్కడ నివసించినందున కళ్యాణ వేంకటేశ్వరుని ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధమైంది. దీన్ని ఎవరు కట్టించారన్నది ఇతమిద్ధంగా తెలియదు. అయితే ఈ ఆలయం శిధిలావస్థలో వున్నప్పుడు తాళ్ళపాక అన్నమాచార్యుల మనవడైన చిన తిరుమలయ్య పునరుద్దరించారు. తిరిగి 1967లో టిటిడి వారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. 1981 నుంచి టిటిడి వారే స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతి యేటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇటీవల ప్రహరీగోడ నిర్మించడం జరిగింది. ఆలయం ఎదుట కోనేరు నిర్మా ణం, ఆంజనేయస్వామి ఆలయం కట్టారు. రధాన్ని శాశ్వితంగా ఉంచడానికి ఒక షెల్టర్‌ ‌నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో రాళ్ళను పరిపించారు. టిటిడి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో కళ్యాణ మండపం కూడా నడు స్తోంది. తిరుపతి, మదనపల్లి రహదారిని ఆనుకొని శ్రీవారి ఆలయం ఉంది. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ ఊరికి బస్సులు నడుస్తు న్నాయి. చంద్రగిరి నుంచి కూడా మరొక మార్గం వుంది. శ్రీనివాస మంగాపురంలో నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది. 500 రూపాయల రుసుము చెల్లించి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రశాంత వాతావరణం, విశాలమైన ఆవరణం, అద్భు తమైన శిల్ప సంపద ఈ ఆలయ ప్రత్యే కతలు. ఆలయ నిర్మాణానికి పెద్ద పెద్ద బండ రాళ్ళను వాడారు. పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఉపయోగించారు. ఈ స్తంభాల పై పురాణ గాధలను దేవతామూర్తులను చెక్కారు. అన్నమాచార్యుల వంశం వారి శిల్పాలు కూడా స్తంభాల పై కనిపిస్తాయి. నిలువెత్తు ద్వార పాలకుల విగ్రహాలు గర్భగుడి ముందు దర్శనమిస్తాయి. అన్నమాచార్యుల వారి పూజా సామాగ్రి, ఆయన పూజించే దేవతా విగ్రహాలు ఈ ఆలయంలో ఇటీవల వరకు ఒక చెక్క బోషాణంలో వుండేవి. ఇప్పు డు అవి టిటిడి వారి ఆధీనంలో వున్నాయి. ఆలయ నిర్మాణాన్ని గమనిస్తే ఎక్కువగా విజయనగర ప్రభువుల కాలంలో అభివృద్ధి జరిగినట్లు తెలుస్తుంది. సూర్యచంద్రులు, హంస లాంటి శిల్పా లు స్తంభాల పై కన్పిస్తాయి. హైదరాలీ దాడిని ఈ దేవాలయం 17వ శతాబ్దంలో ఎదుర్కొని నిలబడింది. ఈ ఆలయం పై దాడి తరువాత హైదరాలి అనారోగ్యంతో మరణించాడని చెప్తుంటారు. తొండవాడ ప్రాంతానికి చెందిన చంద్రమౌళి రెడ్డి అనే ఐఏఎస్‌ అధికారి ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. నిలువెత్తు వేంకటేశ్వరుని విగ్రహం ఈ ఆలయం ప్రత్యేకత. మిరుమిట్లు గొలిపే లైట్ల కాంతులతో, అద్భుతమైన అలంకరణలతో వేంకటేశ్వర స్వామి విగ్రహం అలరారుతూ వుంటుంది. ఎంత సేపు దర్శించుకున్నా తనవి తీరని సౌందర్యం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారిది. ప్రశాంతంగా ఎక్కువ సేపు స్వామి వారి ముందు నిలబడి ధ్యానించు కోవాలన్న కోరిక వున్నవారు ఈ ఆలయాన్ని తరచూ దర్శించుకొని తన్మయత్వం పొందవచ్చు. డాక్టర్‌ ‌గంగిశెట్టి శివకుమార్‌, ‌పున్నమి దినపత్రిక గౌరవ సంపాదకులు. సెల్‌ : 9441895343

తనివితీరా స్వామివారిని దర్శించుకోవాలంటే మంగాపురం వెళ్లాల్సిందే
ప్రతి యేటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో బ్రహ్మోత్సవాలు
నిలువెత్తు వేంకటేశ్వరుని విగ్రహం ఈ ఆలయం ప్రత్యేకత.
వేంకటాద్రి పర్వతానికి సమానమైనది బ్రహ్మాండలోకాల్లో లేదనని, శ్రీవారికి సమానమైన దేవుడు గతంలో కాని, భవిష్యత్‌లో కాని ఉండరని పెద్దలంటారు. అంతటి మహిమగల భగవానుణ్ణి దర్శించుకోవడం అంత తేలిక విషయం కాదు. వ్యయ ప్రయాసల సంగతులటుంచి, తృప్తి తీరా దర్శనం చేసుకునే వీలువుండదు. గంటల కొద్ది క్యూలో నిలబడ్డ తర్వాత దర్శనం లభించేది కొద్ది క్షణాలు మాత్రమే. ఆ క్షణాల్లోనే భక్తులకు అనిర్వచనీయమైన అలౌకికానందం కలుగుతుంది. పడిన శ్రమంతా మరిచిపోతారు. మళ్ళీ ఎప్పుడు దర్శన భాగ్యం కలుగుతుందా? అని ఎదురుచూస్తుంటారు. వీలు చిక్కగానే మళ్ళీ తిరుమలకు ప్రయాణం కడుతుంటారు.

అయితే తృప్తిదీరా వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే మార్గం వుంది. అదేమంటే వేంకటాద్రి పర్వతాన్ని తాకుతున్నట్టుగా శ్రీవారి పాదాల చెంత, శ్రీవారికి ప్రతి రూపంగా వున్న కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వుంది. మూలవిరాట్టు ముందు నిలబడి నిలువెత్తు సుందర మైన ఆ విగ్రహాన్ని ఎంత సేపైనా దర్శించుకోవచ్చు. అదే శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం.
శ్రీపద్మావతిదేవితో నారాయణ వనంలో వివాహం జరిగిన పిమ్మట ఈ ప్రాంతంలో శ్రీనివాసుడు కొంత కాలం నివసించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. పరిణయ అనంతరం కళ్యాణ వేంకటేశ్వరుడైన శ్రీవారు పద్మావతితో కలిసి వస్తూ తొండవాడ ఆశ్రమంలో వున్న ఆగస్త్య మహామునిని దర్శించారు. అగస్త్యుని దర్శించుకున్న నవ దంపతులు కొండ ఎక్కడానికి వెళ్తుండగా అగస్త్యుడు పసుపు గుడ్డలతో కొండ ఎక్క కూడదని చెప్పాడు. అగస్త్యుని సలహా ప్రకారం ఆ కొత్త దంపతులు శ్రీనివాసమంగా పురం అనే ప్రాంతంలో ఆరు మాసాల పాటు నివసించారు.

ఈ ‌సమయంలో వారు ప్రతి రోజు అగ స్త్యుని దర్శించుకునే వారు. గడువు పూర్తయిన పిమ్మట శ్రీవారు నడిచి వెళ్ళి తిరుమల చేరా రు. శ్రీనివాసుడు నివసించిన ఈ ప్రాంతం తర్వాత శ్రీనివాస మంగాపురం అయింది. అంతకు ముందు దాని పేరు సిద్దకూటమి. శ్రీవారు కొండపైకి నడిచిన దారి శ్రీవారి మెట్టు అయింది. కళ్యాణం తర్వాత ఆయన ఇక్కడ నివసించినందున కళ్యాణ వేంకటేశ్వరుని ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధమైంది. దీన్ని ఎవరు కట్టించారన్నది ఇతమిద్ధంగా తెలియదు.
అయితే ఈ ఆలయం శిధిలావస్థలో వున్నప్పుడు తాళ్ళపాక అన్నమాచార్యుల మనవడైన చిన తిరుమలయ్య పునరుద్దరించారు. తిరిగి 1967లో టిటిడి వారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. 1981 నుంచి టిటిడి వారే స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.
ప్రతి యేటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇటీవల ప్రహరీగోడ నిర్మించడం జరిగింది. ఆలయం ఎదుట కోనేరు నిర్మా ణం, ఆంజనేయస్వామి ఆలయం కట్టారు. రధాన్ని శాశ్వితంగా ఉంచడానికి ఒక షెల్టర్‌ ‌నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో రాళ్ళను పరిపించారు. టిటిడి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో కళ్యాణ మండపం కూడా నడు స్తోంది. తిరుపతి, మదనపల్లి రహదారిని ఆనుకొని శ్రీవారి ఆలయం ఉంది. ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈ ఊరికి బస్సులు నడుస్తు న్నాయి. చంద్రగిరి నుంచి కూడా మరొక మార్గం వుంది. శ్రీనివాస మంగాపురంలో నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది. 500 రూపాయల రుసుము చెల్లించి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రశాంత వాతావరణం, విశాలమైన ఆవరణం, అద్భు తమైన శిల్ప సంపద ఈ ఆలయ ప్రత్యే కతలు. ఆలయ నిర్మాణానికి పెద్ద పెద్ద బండ రాళ్ళను వాడారు. పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఉపయోగించారు. ఈ స్తంభాల పై పురాణ గాధలను దేవతామూర్తులను చెక్కారు. అన్నమాచార్యుల వంశం వారి శిల్పాలు కూడా స్తంభాల పై కనిపిస్తాయి. నిలువెత్తు ద్వార పాలకుల విగ్రహాలు గర్భగుడి ముందు దర్శనమిస్తాయి. అన్నమాచార్యుల వారి పూజా సామాగ్రి, ఆయన పూజించే దేవతా విగ్రహాలు ఈ ఆలయంలో ఇటీవల వరకు ఒక చెక్క బోషాణంలో వుండేవి. ఇప్పు డు అవి టిటిడి వారి ఆధీనంలో వున్నాయి. ఆలయ నిర్మాణాన్ని గమనిస్తే ఎక్కువగా విజయనగర ప్రభువుల కాలంలో అభివృద్ధి జరిగినట్లు తెలుస్తుంది.

సూర్యచంద్రులు, హంస లాంటి శిల్పా లు స్తంభాల పై కన్పిస్తాయి. హైదరాలీ దాడిని ఈ దేవాలయం 17వ శతాబ్దంలో ఎదుర్కొని నిలబడింది. ఈ ఆలయం పై దాడి తరువాత హైదరాలి అనారోగ్యంతో మరణించాడని చెప్తుంటారు. తొండవాడ ప్రాంతానికి చెందిన చంద్రమౌళి రెడ్డి అనే ఐఏఎస్‌ అధికారి ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు.
నిలువెత్తు వేంకటేశ్వరుని విగ్రహం ఈ ఆలయం ప్రత్యేకత. మిరుమిట్లు గొలిపే లైట్ల కాంతులతో, అద్భుతమైన అలంకరణలతో వేంకటేశ్వర స్వామి విగ్రహం అలరారుతూ వుంటుంది. ఎంత సేపు దర్శించుకున్నా తనవి తీరని సౌందర్యం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారిది. ప్రశాంతంగా ఎక్కువ సేపు స్వామి వారి ముందు నిలబడి ధ్యానించు కోవాలన్న కోరిక వున్నవారు ఈ ఆలయాన్ని తరచూ దర్శించుకొని తన్మయత్వం పొందవచ్చు.

డాక్టర్‌ ‌గంగిశెట్టి శివకుమార్‌,
‌పున్నమి దినపత్రిక గౌరవ సంపాదకులు.
సెల్‌ : 9441895343

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.