కామారెడ్డి, 26 సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గాంధీ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభ వంగా కొనసాగుతున్నాయి. సమాఖ్య 18వ వార్షికో త్సవాన్ని పురస్కరించుకుని అష్టాదశ శక్తి పీఠాల ను ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు అమ్మవారిని ఒక్కో అవతారంలో ప్రత్యేక అలంకరణతో అలంకరించి, విశేష పూజలునిర్వహి స్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజున అమ్మవారిని లక్ష్మీదేవి అలంకారంలో అలంకరిం చారు. ఈ శుభ సందర్భంగా మహిళా మణులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన కార్యక్ర మాన్ని ఘనంగా నిర్వహించారు.ప్రతిరోజు ఉద యం, సాయంత్రం వేళల్లో పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం భజన కార్యక్రమాలు, దాండియా ఆటపాటలు వంటి సాంస్కృతిక కార్యక్ర మాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉత్సవాలలో మహిళా మణులు, మాల స్వా ములు, కండువా స్వాములు, బాల స్వాములు వంటి వివిధ వర్గాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొ ని అమ్మవారి ఆశీస్సులు పొందు తున్నారు.ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల నిర్వహణను గాంధీ యువజ న సమాఖ్య పాలకమండలి సభ్యులు పర్యవేక్షిస్తు న్నారు. భక్తి పారవశ్యంలో రామారెడ్డి మండల కేంద్రం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తోంది. ఈ కార్యక్రమంలో గాంధీ సమాఖ్య మండలి సభ్యులు పాల్గొన్నారు


