Monday, 31 August 2026
  • Home  
  • కొత్తపేటలో జాబ్ మేళాలో పాల్గొన్న యువనాయకుడు బండారు సంజీవ్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొత్తపేటలో జాబ్ మేళాలో పాల్గొన్న యువనాయకుడు బండారు సంజీవ్

కొత్తపేట: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కోతపేటలోని వి.కె.వి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు వికాసా ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు పలు ప్రముఖ కంపెనీలు హాజరై యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాయి.ఈ కార్యక్రమంలో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు తనయుడు, యువనాయకుడు బండారు సంజీవ్ పాల్గొని జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల కోసం హాజరైన యువతతో మాట్లాడి వారి వివరాలను తెలుసుకున్నారు. యువతకు అందుబాటులోకి వచ్చిన ఇటువంటి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా మంచి ఉద్యోగాలను సాధించాలని ఆయన సూచించారు.జాబ్ మేళాలో ఫాక్స్‌కాన్, ప్రీమియర్ ఎనర్జీ, అపోలో టైర్స్, టీవీఎస్ సుందరం ఫాస్టెనర్స్, టాటా ఏఐఏ, అవంతి సీ ఫుడ్స్, ఐసీఐసీఐ–ఎన్‌ఐఐటీ బ్యాంక్, ఎస్‌బీ మోటార్స్, అపోలో ఫార్మసీ, డెక్కన్ ఫైన్ కెమికల్స్ తదితర ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత జాబ్ మేళాకు హాజరై తమ విద్యార్హతలు, వివరాలను నమోదు చేసుకుని ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు సంస్థల ప్రతినిధుల సమక్షంలో కాల్ లెటర్లను అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.