పున్నమి ప్రతి నిధి.
కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడానికి శుభప్రదమైన సమయం గురించి ఎన్నోమంది వేచిచూస్తూ ఉంటారు. ఈసారి కార్తీక పౌర్ణమి రోజున దీపం పెట్టడానికి శుభ సమయం సాయంత్రం 5:15 నిమిషాల నుండి 7:50 నిమిషాల వరకు ఉంది. ఈ సమయములో దీపాలు వెలిగించడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించి దీపం వెలిగించడం మంచిదిగా పరిగణిస్తారు. దీపం వెలిగించేటప్పుడు ‘ఓం నమో నారాయణాయ’, ‘ఓం నమశ్శివాయ’ మంత్రాలు జపించడం శ్రేయస్కరం.


