రాజంపేట మండల కేంద్రంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రైవేటు పాఠశాలల్లో వారి పిల్లలకు ఫీజులో రాయితీ ఇస్తూ జిల్లా కలెక్టర్ విడుదల చేసిన ఉత్తర్వులు ప్రైవేటు పాఠశాలలు విధిగా అమలు చేయాలని ఏపీయూడబ్ల్యూజే, రాజంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి రఘునాథ రాజు, సుబ్బరాయుడు లకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, తాలూకా అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం రాయితీతో కూడిన విద్యను అందించే జిల్లా కలెక్టర్ ఆదేశాలు ప్రతి ప్రైవేటు పాఠశాలలను అమలు చేయాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ద్వారా జిల్లా కలెక్టర్ తో సంప్రదించడం జరిగిందని, కలెక్టర్ సానుకూలంగా స్పందించి రాయితీ ఇవ్వడం అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు.

కలెక్టర్ జీవోను అమలు చేయాలి-భాస్కర్