రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులువారిపల్లి మండలం లొ ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలు మరియు పట్టణాలకు కనెక్టింగ్ రోడ్లు సమస్యలపై ప్రజలు పంచాయతీ శాఖకు సమాచారం అందించినట్లయితే, వీలైనంత త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయించే దిశగా చర్యలు
తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారని రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ పేర్కొన్నారు.
గ్రామాల నుంచి వ్యవసాయ భూములకు కనెక్టింగ్ రోడ్డు పెండింగ్ పనులు ఉన్నచో వాటిని గుర్తించి తెలియజేయవలసిందిగా సంబంధిత అధికారులకు సూచించారు.
అలాగే హార్టికల్చర్ కు సంబంధించిన అంశంలో, గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు అచ్చం నాయుడు మామిడి రైతులకు కిలోకు నాలుగు రూపాయలు చొప్పున గిట్టుబాటు ధరగా ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించినట్లు, ఆ సహాయం అందించడం జరిగిందని తెలిపారు. అన్నదాత సుఖీభవ రెండవ విడత త్వరలోనే ప్రారంభం కాబోతుందని, అలాగే తల్లికి వందనం పథకం అందని అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆరవ శ్రీధర్ తెలిపారు. తదుపరి కార్యక్రమంగా స్త్రీనిధి రుణాలకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖ అధికారులు, కూటమి నేతలు, సర్పంచులు పాల్గొన్నారు.

