గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి):
నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి కారణంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అన్నారు. గాజువాక బీసీ రోడ్డులోని విజ్ఞాన్ హై స్కూల్ ఆధ్వర్యంలో కేర్, రెయిన్బో, ఇన్వెండెంట్ డెంటల్ హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించగా, ముందస్తు వైద్య పరీక్షల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. ఉచిత వైద్య సేవలు అందించిన ఆస్పత్రుల సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు.


