Tuesday, 9 December 2025
  • Home  
  • శ్రీశైలం ప్రాజెక్టు ఓనర్ ఎవరు..? గొయ్యిని పూడ్చే బాధ్యత ఎవరిది..?
- ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం ప్రాజెక్టు ఓనర్ ఎవరు..? గొయ్యిని పూడ్చే బాధ్యత ఎవరిది..?

శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం కింద 143 అడుగుల గొయ్యి ఏర్పడి ప్రాజెక్టు మొత్తానికి ప్రమాదం పొంచి ఉన్న క్రమంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) చర్యలకు ఉప్రకమించింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్​లో పడిన గొయ్యిపై నిర్లక్ష్యం వహిస్తుండటంపై సీరియస్ అయిన ఎన్​డీఎస్​ఏ చైర్మన్ అనిల్ జైన్.. శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం కింద 143 అడుగుల గొయ్యి ఏర్పడి ప్రాజెక్టు మొత్తానికి ప్రమాదం పొంచి ఉన్న క్రమంలో  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) చర్యలకు ఉప్రకమించింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్​లో పడిన గొయ్యిపై నిర్లక్ష్యం వహిస్తుండటంపై సీరియస్ అయిన ఎన్​డీఎస్​ఏ చైర్మన్ అనిల్ జైన్.. శ్రీశైలం ప్రాజెక్టు ఎవరి అధీనంలో ఉందని, ఓనర్ ఎవరని  ప్రశ్నించారు. ఇప్పటికీ ఓ స్పష్టత లేదని ఏపీ సమాధానం చెప్పింది. ప్రాజెక్టు నిర్వహణను ఎవరు చూస్తున్నారని అనిల్ జైన్ ప్రశ్నించగా.. తామే చూస్తున్నామంటూ ఏపీ బదులిచ్చింది. అలాంటప్పుడు డ్యామ్​పై పూర్తి బాధ్యత మీది కాదా? అని అనిల్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ చూసే వాళ్లే డ్యామ్​కు ఓనర్​ అన్న విషయం తెలియదా? అని మండిపడ్డారు. శ్రీశైలం ఓనర్​గా ఆ ప్రాజెక్ట్​ సీఈ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఓనర్​గా నల్గొండ సీఈలు ఉండాలని తేల్చి చెప్పారు. ఆ రెండు ప్రాజెక్టుల పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టెట్రాపాడ్స్​తో గొయ్యిని పూడ్చండి శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్​పూల్​లో ఏర్పడిన గొయ్యిని కాంక్రీట్ టెట్రాపాడ్స్​తో పూడ్చాల్సిందిగా ఎన్​డీఎస్​ఏకి తెలంగాణ ఈఎన్​సీ జి.అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జియోలాజికల్ స్టడీస్​, డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ పరీక్షలు నిర్వహించేలా ఏపీని ఆదేశించాలన్నారు. 2009లో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొంత కుదుపులకు లోనైందని గుర్తు చేశారు. ఆ ఏడాది ఎన్నడూ లేనంతగా 24 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైందన్నారు. దీంతో ప్రాజెక్టులోని ప్రెజర్ సెల్స్ పనిచేయడం లేదని వివరించారు. డ్యామ్ గ్యాలరీలోని డ్రైనేజీ రంధ్రాలు మూసుకుపోయాయన్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో భూకంపాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన పరికరాలూ పనిచేయడం లేదని, వాటిని ఏపీ పట్టించుకోవడం లేదని ఎన్​డీఎస్​ఏకి అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. గెజిట్ ప్రకారం శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఏపీ ఈఎన్​సీ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అయితే, ప్రస్తుతం ఆ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నదని, నీటి పంపకాలపై ట్రిబ్యునల్​లో వాదనలు జరుగుతున్నాయని, అలాంటప్పుడు బోర్డుకు ప్రాజెక్టులను ఎలా అప్పగిస్తామని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్​సీ అనిల్​ కుమార్​, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సీఈ ప్రమీల, సెంట్రల్​ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ మోహన్ కుమార్, గోదావరి బేసిన్​ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యప్రసాద్, ఏపీ ఈఎన్​సీ వెంకటేశ్వర రావు, శ్రీశైలం సీఈ కబీర్ బాషా తదితరులు హాజరయ్యారు.

శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం కింద 143 అడుగుల గొయ్యి ఏర్పడి ప్రాజెక్టు మొత్తానికి ప్రమాదం పొంచి ఉన్న క్రమంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) చర్యలకు ఉప్రకమించింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్​లో పడిన గొయ్యిపై నిర్లక్ష్యం వహిస్తుండటంపై సీరియస్ అయిన ఎన్​డీఎస్​ఏ చైర్మన్ అనిల్ జైన్..

శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం కింద 143 అడుగుల గొయ్యి ఏర్పడి ప్రాజెక్టు మొత్తానికి ప్రమాదం పొంచి ఉన్న క్రమంలో  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) చర్యలకు ఉప్రకమించింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్​లో పడిన గొయ్యిపై నిర్లక్ష్యం వహిస్తుండటంపై సీరియస్ అయిన ఎన్​డీఎస్​ఏ చైర్మన్ అనిల్ జైన్.. శ్రీశైలం ప్రాజెక్టు ఎవరి అధీనంలో ఉందని, ఓనర్ ఎవరని  ప్రశ్నించారు. ఇప్పటికీ ఓ స్పష్టత లేదని ఏపీ సమాధానం చెప్పింది. ప్రాజెక్టు నిర్వహణను ఎవరు చూస్తున్నారని అనిల్ జైన్ ప్రశ్నించగా.. తామే చూస్తున్నామంటూ ఏపీ బదులిచ్చింది.

అలాంటప్పుడు డ్యామ్​పై పూర్తి బాధ్యత మీది కాదా? అని అనిల్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ చూసే వాళ్లే డ్యామ్​కు ఓనర్​ అన్న విషయం తెలియదా? అని మండిపడ్డారు. శ్రీశైలం ఓనర్​గా ఆ ప్రాజెక్ట్​ సీఈ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఓనర్​గా నల్గొండ సీఈలు ఉండాలని తేల్చి చెప్పారు. ఆ రెండు ప్రాజెక్టుల పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

టెట్రాపాడ్స్​తో గొయ్యిని పూడ్చండి

శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్​పూల్​లో ఏర్పడిన గొయ్యిని కాంక్రీట్ టెట్రాపాడ్స్​తో పూడ్చాల్సిందిగా ఎన్​డీఎస్​ఏకి తెలంగాణ ఈఎన్​సీ జి.అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జియోలాజికల్ స్టడీస్​, డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ పరీక్షలు నిర్వహించేలా ఏపీని ఆదేశించాలన్నారు. 2009లో వచ్చిన భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొంత కుదుపులకు లోనైందని గుర్తు చేశారు. ఆ ఏడాది ఎన్నడూ లేనంతగా 24 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైందన్నారు.

దీంతో ప్రాజెక్టులోని ప్రెజర్ సెల్స్ పనిచేయడం లేదని వివరించారు. డ్యామ్ గ్యాలరీలోని డ్రైనేజీ రంధ్రాలు మూసుకుపోయాయన్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో భూకంపాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన పరికరాలూ పనిచేయడం లేదని, వాటిని ఏపీ పట్టించుకోవడం లేదని ఎన్​డీఎస్​ఏకి అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. గెజిట్ ప్రకారం శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఏపీ ఈఎన్​సీ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

అయితే, ప్రస్తుతం ఆ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నదని, నీటి పంపకాలపై ట్రిబ్యునల్​లో వాదనలు జరుగుతున్నాయని, అలాంటప్పుడు బోర్డుకు ప్రాజెక్టులను ఎలా అప్పగిస్తామని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్​సీ అనిల్​ కుమార్​, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సీఈ ప్రమీల, సెంట్రల్​ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ మోహన్ కుమార్, గోదావరి బేసిన్​ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యప్రసాద్, ఏపీ ఈఎన్​సీ వెంకటేశ్వర రావు, శ్రీశైలం సీఈ కబీర్ బాషా తదితరులు హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.