సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @విజయవాడ
ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకొని కొండపైన ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి అనిత
అనంతరం మోడల్ గెస్డ్ హౌస్ లో అధికారులతో సమీక్ష నిర్వహించిన హోం మంత్రి అనిత
సమీక్ష లో పాల్గొన్న ఎంపి కేశినేని శివనాధ్ చిన్ని, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, సిపి రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్
సీసీ కెమెరాలు,ట్రాఫిక్,క్యూ లైన్లు,Vip పాస్ లు పై అధికారులతో చర్చించిన హోం మంత్రి అనిత
*హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*
దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు
15 లక్షల మంది భక్తులు ఈసారి దసరా ఉత్సవాలకు వస్తారని అంచనా వేస్తున్నాం .అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం
గతంలో ఒక్క ఇన్సిడెంట్ లేకుండా దసరా ఉత్సవాలని దిగ్విజయంగా జరిపాం
అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తాం
మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుస్తోంది.
వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం
4,500 మందితో పోలీసులతో బధ్రతా ఏర్పాట్లు చేస్తున్నాం
వెయ్యి కి పైగా సిసి కెమేరాలతో పాటు ఐదు డ్రోన్లతో దసరా ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నాం.


