నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
ఇసుక తవ్వకాలకు సంబంధించి వివిధ శాఖలు సమర్పించిన నివేదికలను క్రోడీకరించి నల్గొండ జిల్లాకు సంబంధించి రూపొందించిన జిల్లా సమగ్ర నివేదికను (డి.ఎస్.ఆర్) వెబ్ సైట్ http://nalgonda.telangana.gov.in లో పొందుపరిచినట్టు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని ఇసుక తవ్వకాలకు సంబంధించి సాంకేతిక శాఖలైన నీటిపారుదల, గనులు, భూగర్భ జల వనరులు, టీ ఎస్ ఎం ఐ డి సి,అటవీ,రెవెన్యూ వంటి ముఖ్య ప్రణాళిక అధికారి శాఖల నుండి ఇసుక తవ్వకాలపై నివేదికలను కోరడం జరిగిందని, ఈ మేరకు ఆయా శాఖలు సమర్పించిన నివేదికలన్నిటిని పూర్తిస్థాయి జిల్లా సమగ్ర నివేదిక (డి.ఎస్.ఆర్ ) గా మార్చి పైన పేర్కొన్న వెబ్ సైట్ లో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. వెబ్ సైట్ లో ఉంచిన జిల్లా సమగ్ర నివేదికపై ఏవైనా సందేహాలు, సలహాలు, అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 25 (25/10/ 2025 )లోగా Admgnlg @gmail. Com మెయిల్ కు పరిశీలనకు పంపవలసిందిగా ఆమె కోరారు.


