Saturday, 19 July 2025
  • Home  
  • ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
- జయశంకర్ భూపాలపల్లి - తెలంగాణ

ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

కాటారం, జులై 14, పున్నమి ప్రతినిధి: మహిళా శ్వశక్తి సంఘాలు క్రియాశీలకంగా పనిచేసి ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం మంథని నియోజకవర్గ పరిదిలోని కాటారం, మహాదేవ పూర్, మహా ముత్తారం, పలిమెల, మల్హర్ మండలాల పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ఫ్ ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాలు, బాంక్ లింకేజీ, ప్రమాద భీమా, రుణ భీమా, మహిళా సంఘాలు ద్వారా నడుపుతున్న ఆర్టీసీ బస్సుకు అద్దె చెల్లింపులు, ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ ను రెడ్ కో సంస్థ ద్వారా తిరిగి ప్రభుత్వం కోనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో లభ్యమయ్యే అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మహిళా సంఘాలు ద్వారా దాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్దేశ్యం, లక్ష్యం మహిళల ఆర్థికాభివృద్ధి ద్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. 36,34,751 లక్షల రూపాయలు ప్రమాద భీమా, రుణ భీమా 30 లక్షలు, బ్యాంకు లింకేజీ 10.30 కోట్లు, 69.03 లక్షలు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. డివిజన్ లో మొత్తం 3161 మహిళా సంఘాలలో 32070 మంది సభ్యులున్నారని తెలిపారు.మహిళలు తలచుకుంటే చేయలేనిది ఏమి ఉండదని ఇంట్లో వంట నుండి పిల్లల విద్యాబ్యాసం వరకు అన్నింటిలో మహిళలు ముందుంటారని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో మహిళలలకు పైసా కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని తెలిపారు. అవసరాన్ని బట్టి రుణాలు, వనరులు సమకూర్చి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వ్యాపార వేత్తలుగా తయారు చేయనున్నట్లు తెలిపారు. మీ శక్తి, యుక్తి కి వాణిజ్య, వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పనకు ప్రభుత్వం గొప్ప ఆలోచనలతో ముందుకు పోతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా కోటి రూపాయలతో సోలార్ విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ప్రభుత్వానికి విద్యుత్ విక్రంయించి సంఘాల సభ్యులకు ఆదాయం సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. వారం రోజుల్లో మండలానికి 100 మంది మహిళలకు కుట్టు మిషన్లులో శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని డీఆర్డీవోను ఆదేశించారు. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. 200 లోపు ఉచిత విద్యుత్తు, 500లకు గ్యాస్, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, 9 రోజులలో 9 వేల కోట్లు రైతు భరోసా, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు ద్వారా ఇందిరామహిళా శక్తి క్యాన్టీన్లు, వడ్డీలే ని రుణాలు, దాన్యం కొనుగోలు కేంద్రాలు, యూనిఫామ్స్ కుట్టించే పనులు, గణపురం, మహాదేవ పూర్ లో మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఇస్తూ ఆర్థికాభివృద్ధి కి కృషి చేస్తున్నట్లు వివరించారు. మహిళా సాధికారితకు టీము వర్కుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న 6 రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షలు చొప్పున 30 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి, స్థానికసంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, 5 మండలాల సింగిల్ విండో చైర్మన్లు, సమ్మక్క సారక్క జిల్లా మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు శ్రీలత, కార్యదర్శి రజిత తదితరులు పాల్గొన్నారు.

కాటారం, జులై 14, పున్నమి ప్రతినిధి: మహిళా శ్వశక్తి సంఘాలు క్రియాశీలకంగా పనిచేసి ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

సోమవారం మంథని నియోజకవర్గ పరిదిలోని కాటారం, మహాదేవ పూర్, మహా ముత్తారం, పలిమెల, మల్హర్ మండలాల పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ఫ్ ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాలు, బాంక్ లింకేజీ, ప్రమాద భీమా, రుణ భీమా, మహిళా సంఘాలు ద్వారా నడుపుతున్న ఆర్టీసీ బస్సుకు అద్దె చెల్లింపులు, ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ ను రెడ్ కో సంస్థ ద్వారా తిరిగి ప్రభుత్వం కోనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో లభ్యమయ్యే అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మహిళా సంఘాలు ద్వారా దాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్దేశ్యం, లక్ష్యం మహిళల ఆర్థికాభివృద్ధి ద్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. 36,34,751 లక్షల రూపాయలు ప్రమాద భీమా, రుణ భీమా 30 లక్షలు, బ్యాంకు లింకేజీ 10.30 కోట్లు, 69.03 లక్షలు వడ్డీలేని రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. డివిజన్ లో మొత్తం 3161 మహిళా సంఘాలలో 32070 మంది సభ్యులున్నారని తెలిపారు.
మహిళలు తలచుకుంటే చేయలేనిది ఏమి ఉండదని ఇంట్లో వంట నుండి పిల్లల విద్యాబ్యాసం వరకు అన్నింటిలో మహిళలు ముందుంటారని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో మహిళలలకు పైసా కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని తెలిపారు. అవసరాన్ని బట్టి రుణాలు, వనరులు సమకూర్చి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వ్యాపార వేత్తలుగా తయారు చేయనున్నట్లు తెలిపారు. మీ శక్తి, యుక్తి కి వాణిజ్య, వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పనకు ప్రభుత్వం గొప్ప ఆలోచనలతో ముందుకు పోతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా కోటి రూపాయలతో సోలార్ విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ప్రభుత్వానికి విద్యుత్ విక్రంయించి సంఘాల సభ్యులకు ఆదాయం సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. వారం రోజుల్లో మండలానికి 100 మంది మహిళలకు కుట్టు మిషన్లులో శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని డీఆర్డీవోను ఆదేశించారు. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. 200 లోపు ఉచిత విద్యుత్తు, 500లకు గ్యాస్, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, 9 రోజులలో 9 వేల కోట్లు రైతు భరోసా, రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామన్నారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు ద్వారా ఇందిరామహిళా శక్తి క్యాన్టీన్లు, వడ్డీలే ని రుణాలు, దాన్యం కొనుగోలు కేంద్రాలు, యూనిఫామ్స్ కుట్టించే పనులు, గణపురం, మహాదేవ పూర్ లో మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఇస్తూ ఆర్థికాభివృద్ధి కి కృషి చేస్తున్నట్లు వివరించారు. మహిళా సాధికారితకు టీము వర్కుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం ఆత్మహత్య చేసుకున్న 6 రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షలు చొప్పున 30 లక్షలు ఆర్థిక సాయం అందించారు.

ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి, స్థానికసంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఆర్డీఓ బాలకృష్ణ, 5 మండలాల సింగిల్ విండో చైర్మన్లు, సమ్మక్క సారక్క జిల్లా మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు శ్రీలత, కార్యదర్శి రజిత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.