Saturday, 19 July 2025
  • Home  
  • ఆ…నాటి నెల్లూరు మహనీయులు
- Featured - ఆంధ్రప్రదేశ్

ఆ…నాటి నెల్లూరు మహనీయులు

ఆ…నాటి నెల్లూరు మహనీయులు పొట్టి శ్రీరాములు – రాష్ట్ర సాధన గాంధేయవాదాన్ని ఆయుధంగా చేసుకొని ప్రత్యేకరాష్ట్రం కొరకు నిరసన దీక్ష చేపట్టి ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టిశ్రీరాములు. వీరు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. వీరు జన్మించింది మద్రాసులో అయినా, స్వగ్రామము బోగోలు మండలంలోని జువ్వల దిన్నె. పూర్వీకులు నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లి గ్రామానికి చెందినవారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. శానిటరి ఇంజనీరింగ్‌ చదివి రైల్వేలో ఉద్యోగం పొంది స్థిర పడుతున్న రోజులలో భార్యావియోగం కలిగింది. పురిటిబిడ్డ కూడ మరణించింది. విధి వంచితుడైన శ్రీరాములు విరక్తి, వైరాగ్యాలకు లోనయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేశారు. వేదాంత ధోరణి వచ్చింది. స్వభావరీత్యా ఆయనలో ఉన్న పట్టుదల, కార్యదీక్ష సడలలేదు. గాంధీజీ ప్రబోధాలకు ఉత్తేజితులయి వార్ధాలోని ఆశ్రమాన్ని దర్శించి అందులో చేరిపోయారు. గాంధీజీ నుండి నేర్చుకొన్నవే ఖద్దరుధారణ, హరిజనోద్ధరణ, హరిజన దేవాలయ ప్రవేశం కొరకు కృషి, అస్పృశ్యతా నివారణ, స్వాతంత్య్ర సాధనకు అహింసా పోరాటం, ఉప్పు సత్యాగ్రహం మొదలయినవి. 18 నెలల జైలు జీవితం అను భవించారు. గాంధీజీ భావాలు శ్రీరాములుకు బాగా వంట బట్టాయి. నమ్మిన సిద్ధాంతాన్ని మనసా, వాచా, కర్మణా ఆచరించేవారు. ఏపని చేపట్టినా దానిని సాధించే వరకు నిద్రపోయేవారు కాదు. హరిజన దేవాలయ ప్రవేశం కొరకు నెల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో దీక్ష చేపట్టారు. 23 రోజుల తర్వాత దేవాలయ మేనేజ్‌ మెంట్‌ దిగివచ్చి హరిజనులకు ప్రవేశం కల్పించింది. మొదట పట్టించుకోక పోయినా అప్పటి మద్రాసు ప్రభుత్వం స్పందించింది. పొట్టి శ్రీరాములు పేరు వింటేనే దీక్షలు గుర్తుకొచ్చే విధంగా ఆయన పేరు మార్మోగిపోయింది. అప్పట్లో ఆంధ్రప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. తమిళులు తెలుగువారిపై చిన్నచూపు చూసేవారు. ఆంధ్రప్రాంతం విడివడాలని కొంతకాలం నుండి ఉద్యమాలు సాగుతుండేవి. అది తీవ్రమై రాష్ట్రసాధన కొరకు దీక్షచేపట్టడానికి శ్రీరాములు సిద్ధపడ్డారు. మద్రాసు నగరం నడిబొడ్డున తెలుగువాడైన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బులుసు సాంబమూర్తి ఇంట్లో శ్రీరాములు ఆమరణదీక్ష ప్రారంభించారు. 58రోజులు నిరాహారదీక్షచేసి 1952 డిసెంబరు 15న శ్రీరాములు మరణించడంతో రాష్ట్రం అగ్నిగుండమైంది. అల్లర్లు వ్యాపించాయి. కాల్పులు జరిగాయి. నెల్లూరులో నలుగురు అమాయకులు మరణించారు. పలువురు గాయపడ్డారు. కేంద్రప్రభుత్వం స్పందించింది. ప్రధాని నెహ్రూ పార్లమెంటులో ప్రకటన చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత తెలిపారు. పొణకా కనకమ్మ (1892-1963) జిల్లాలో స్త్రీ విద్యకు నాంది పొణకా కనకమ్మ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న తొలి తరం మహిళ. ఆమె రెండు సార్లు ఏడాదిన్నర పాటు కఠిన కారాగార శిక్ష అను భవించారు. పోట్లపూడిలో సుజన రంజని సమాజం స్థాపించారు. వివేకానంద గ్రంధాలయం నెలకొల్పారు. కనకమ్మ బహుముఖ ప్రజ్ఞాశాలి, నాయకురాలు, వక్త, విప్లవకారిణి, కారుణ్యమూర్తి, రచయిత్రి, రమణాశ్రమంలో వున్న రోజుల్లో ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మతో కలిసి రమణ మహర్షిని కీర్తిస్తూ ‘ఆరాధన’, ‘నైవేద్యం’ రచనలు చేశారు. భగవద్గీతలోని శ్లోకాలను ‘జ్ఞాన నేత్రం’ పేరుతో అనువదించారు. మదరాసులోని ఆంధ్ర మహిళా సభ రజతోత్సవాలలో శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ గారి నుండి కనకమ్మ సన్మానం అందుకున్నారు. ”ఆడపిల్లలకు చదువెందుకు?” అనే అభిప్రాయం నెలకొని ఉన్న రోజులవి. పొణకా కనకమ్మ 1923లో కస్తూరిదేవి బాలికల విద్యాలయం స్థాపించారు. అప్పట్లో అదొక సాహసోపేత నిర్ణయం. భూస్వామ్య కుటుంబం నుండి మహిళ గడపదాటి రావడమే సంచలనం. ఆమె సత్యాగ్రహం చేసి జైలు కెళ్ళింది. వెంకటగిరి జమీందారీ వ్యవస్థపై తిరుగుబాటు చేసింది. తన యావదాస్తిని జాతీయోద్యమానికి, హరిజనోద్ధరణకు, మహిళాభ్యుదయానికి త్యాగం చేసింది. గాంధీజీ వచ్చినప్పుడు ఒంటిమీద నగలన్నీ విరాళంగా ఇచ్చివారి చేత కస్తూరిదేవి విద్యాలయ భవనాలకు 1929లో శంకుస్థాపన చేయించింది. ఆమె కోరిక మేరకు పల్లెపాడులో పినాకినీ సత్యాగ్రహాశ్రమాన్ని గాంధీజీ 1921లో ప్రారంభించారు. దానికవసరమైన 13 ఎకరాల స్థలాన్ని కనకమ్మ కొని ఇచ్చారు. దీనికి ‘దక్షిణాది సబర్మతి’ ఆశ్రమంగా పేరుంది (పల్లెపాడు ఇందుకూరుపేట మండలంలోని గ్రామం). కనకమ్మ వర్ణాంతర వివాహాలు, వితంతు వివాహాలు జరిపించారు. విధి వంచితలైన స్త్రీల అభ్యున్నతికొరకు 1952లో పారిశ్రామిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. మరుపూరివారి ఇంట పుట్టింది – పొణకా వారి ఇంటి కోడలుగా వచ్చింది. రెండు కుటుంబాలకు పేరు ప్రతిష్ఠలు తెచ్చింది. ‘ఆధునిక మహిళలు చరిత్రను తిరగరాస్తారు’ అని చెప్పిన గురజాడవారి మాటలను కనకమ్మ నిరూపించింది. ఆమె తమ్ముడు మరుపూరు కోదండరామిరెడ్డి ‘మందాకిని’ పత్రిక నడిపిన ప్రముఖ సాహితీవేత్త. కనకమ్మ మరణించి (1963) అర్ధశతాబ్దం దాటుతున్నా నెల్లూరు నగరంలోగాని, కస్తూరిదేవి విద్యాలయంలో గాని ఆమె విగ్రహప్రతిష్ఠ నేటికీ జరగకపోవడం విచారకరం.ఆమె స్థాపించిన విద్యాలయం, పల్లెపాడు ఆశ్రమం, నెల్లూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయి. నేడు ఈ ప్రాంతపు ఆడపిల్లలు చదువుల్లో ముందడుగులో ఉండడానికి కారణం ఆనాడు కనకమ్మ వేసిన పునాది. స్త్రీల ప్రగతికి విద్య మౌలికావసరంగా ఆమె ఆ రోజుల్లోనే గుర్తించి ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు. నెల్లూరు పురమందిర నిర్మాత రేబాల లక్ష్మీనర్సారెడ్డి నెల్లూరు నడిబొడ్డున ట్రంకురోడ్డు ప్రక్కన సువిశాలమైన స్థలంలో నెల్లూరు పురమందిర నిర్మాణం జరిగింది. టౌన్‌హాలుగా పేరొందిన దీనిని నిర్మించిన ఉదారుడు రావుబహద్దూరు రేబాల లక్ష్మీనరసారెడ్డి. 1915లో భవనం నిర్మిం చినప్పటి నుండి ఇక్కడ సభలు, సమావేశాలు, నాటక ప్రదర్శనలు, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పట్టణానికిది తలమానికంగా ఉంది. దీన్ని తెలియని వారుండరు. అంతగా ప్రఖ్యాతి వహించింది. వర్ధమాన సమాజం ఆఫీసు, పఠన మందిరం ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఇప్పుడా పురమందిరం స్థలం కోట్లకుకోట్లు విలువ చేస్తుంది. రేబాల కుటుంబీకులు దాతృత్వం కలిగిన వారు. దానగుణం వారికి వంశ పారంపర్యంగా వచ్చింది. రేబాల పట్టాభిరామరెడ్డి వర్థమాన సమాజ అధ్యక్షులుగా వున్నారు. వారి స్మృతి చిహ్నంగా వారి ధర్మపత్ని సుజాతమ్మ పురమందిర ప్రాంగణంలో విశాలమైన పఠన మందిరాన్ని నిర్మించారు. వారి సోదరుడు రేబాల లక్ష్మీనరసారెడ్డి 1943-47లో మున్సిపల్‌ ఛైర్మన్‌గా, 1957-62లో నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా వున్నారు. దాదాపు 35 సంవత్సరాలపాటు వర్థమాన సమాజ అధ్యక్షులుగా వున్నారు. స్టోన్‌హస్‌పేటలోని రేబాల వారివీధిలోని తమ నివాస భవనాన్ని చిన్నపిల్లల ఆస్పత్రి కిచ్చారు. దాని ప్రక్కనే వున్న మరొక భవనాన్ని పట్టాభిరామిరెడ్డి ధర్మ పత్ని సుజాతమ్మ జిల్లా గ్రంథాలయానికిచ్చారు. నెల్లూరు చరిత్రలో వారి కీర్తి చిరస్థాయిగా నిలి చిపోయింది.

ఆ…నాటి నెల్లూరు మహనీయులు
పొట్టి శ్రీరాములు – రాష్ట్ర సాధన
గాంధేయవాదాన్ని ఆయుధంగా చేసుకొని ప్రత్యేకరాష్ట్రం కొరకు నిరసన దీక్ష చేపట్టి ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టిశ్రీరాములు. వీరు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. వీరు జన్మించింది మద్రాసులో అయినా, స్వగ్రామము బోగోలు మండలంలోని జువ్వల దిన్నె. పూర్వీకులు నెల్లూరు జిల్లాలోని పడమటిపల్లి గ్రామానికి చెందినవారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. శానిటరి ఇంజనీరింగ్‌ చదివి రైల్వేలో ఉద్యోగం పొంది స్థిర పడుతున్న రోజులలో భార్యావియోగం కలిగింది. పురిటిబిడ్డ కూడ మరణించింది. విధి వంచితుడైన శ్రీరాములు విరక్తి, వైరాగ్యాలకు లోనయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేశారు. వేదాంత ధోరణి వచ్చింది. స్వభావరీత్యా ఆయనలో ఉన్న పట్టుదల, కార్యదీక్ష సడలలేదు. గాంధీజీ ప్రబోధాలకు ఉత్తేజితులయి వార్ధాలోని ఆశ్రమాన్ని దర్శించి అందులో చేరిపోయారు. గాంధీజీ నుండి నేర్చుకొన్నవే ఖద్దరుధారణ, హరిజనోద్ధరణ, హరిజన దేవాలయ ప్రవేశం కొరకు కృషి, అస్పృశ్యతా నివారణ, స్వాతంత్య్ర సాధనకు అహింసా పోరాటం, ఉప్పు సత్యాగ్రహం మొదలయినవి. 18 నెలల జైలు జీవితం అను భవించారు. గాంధీజీ భావాలు శ్రీరాములుకు బాగా వంట బట్టాయి. నమ్మిన సిద్ధాంతాన్ని మనసా, వాచా, కర్మణా ఆచరించేవారు. ఏపని చేపట్టినా దానిని సాధించే వరకు నిద్రపోయేవారు కాదు.
హరిజన దేవాలయ ప్రవేశం కొరకు నెల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో దీక్ష చేపట్టారు. 23 రోజుల తర్వాత దేవాలయ మేనేజ్‌ మెంట్‌ దిగివచ్చి హరిజనులకు ప్రవేశం కల్పించింది. మొదట పట్టించుకోక పోయినా అప్పటి మద్రాసు ప్రభుత్వం స్పందించింది. పొట్టి శ్రీరాములు పేరు వింటేనే దీక్షలు గుర్తుకొచ్చే విధంగా ఆయన పేరు మార్మోగిపోయింది. అప్పట్లో ఆంధ్రప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది. తమిళులు తెలుగువారిపై చిన్నచూపు చూసేవారు. ఆంధ్రప్రాంతం విడివడాలని కొంతకాలం నుండి ఉద్యమాలు సాగుతుండేవి. అది తీవ్రమై రాష్ట్రసాధన కొరకు దీక్షచేపట్టడానికి శ్రీరాములు సిద్ధపడ్డారు. మద్రాసు నగరం నడిబొడ్డున తెలుగువాడైన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బులుసు సాంబమూర్తి ఇంట్లో శ్రీరాములు ఆమరణదీక్ష ప్రారంభించారు. 58రోజులు నిరాహారదీక్షచేసి 1952 డిసెంబరు 15న శ్రీరాములు మరణించడంతో రాష్ట్రం అగ్నిగుండమైంది. అల్లర్లు వ్యాపించాయి. కాల్పులు జరిగాయి. నెల్లూరులో నలుగురు అమాయకులు మరణించారు. పలువురు గాయపడ్డారు. కేంద్రప్రభుత్వం స్పందించింది. ప్రధాని నెహ్రూ పార్లమెంటులో ప్రకటన చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత తెలిపారు.
పొణకా కనకమ్మ (1892-1963)

జిల్లాలో స్త్రీ విద్యకు నాంది
పొణకా కనకమ్మ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న తొలి తరం మహిళ. ఆమె రెండు సార్లు ఏడాదిన్నర పాటు కఠిన కారాగార శిక్ష అను భవించారు. పోట్లపూడిలో సుజన రంజని సమాజం స్థాపించారు. వివేకానంద గ్రంధాలయం నెలకొల్పారు. కనకమ్మ బహుముఖ ప్రజ్ఞాశాలి, నాయకురాలు, వక్త, విప్లవకారిణి, కారుణ్యమూర్తి, రచయిత్రి, రమణాశ్రమంలో వున్న రోజుల్లో ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మతో కలిసి రమణ మహర్షిని కీర్తిస్తూ ‘ఆరాధన’, ‘నైవేద్యం’ రచనలు చేశారు. భగవద్గీతలోని శ్లోకాలను ‘జ్ఞాన నేత్రం’ పేరుతో అనువదించారు. మదరాసులోని ఆంధ్ర మహిళా సభ రజతోత్సవాలలో శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ గారి నుండి కనకమ్మ సన్మానం అందుకున్నారు. ”ఆడపిల్లలకు చదువెందుకు?” అనే అభిప్రాయం నెలకొని ఉన్న రోజులవి. పొణకా కనకమ్మ 1923లో కస్తూరిదేవి బాలికల విద్యాలయం స్థాపించారు. అప్పట్లో అదొక సాహసోపేత నిర్ణయం. భూస్వామ్య కుటుంబం నుండి మహిళ గడపదాటి రావడమే సంచలనం. ఆమె సత్యాగ్రహం చేసి జైలు కెళ్ళింది. వెంకటగిరి జమీందారీ వ్యవస్థపై తిరుగుబాటు చేసింది. తన యావదాస్తిని జాతీయోద్యమానికి, హరిజనోద్ధరణకు, మహిళాభ్యుదయానికి త్యాగం చేసింది. గాంధీజీ వచ్చినప్పుడు ఒంటిమీద నగలన్నీ విరాళంగా ఇచ్చివారి చేత కస్తూరిదేవి విద్యాలయ భవనాలకు 1929లో శంకుస్థాపన చేయించింది.

ఆమె కోరిక మేరకు పల్లెపాడులో పినాకినీ సత్యాగ్రహాశ్రమాన్ని గాంధీజీ 1921లో ప్రారంభించారు. దానికవసరమైన 13 ఎకరాల స్థలాన్ని కనకమ్మ కొని ఇచ్చారు. దీనికి ‘దక్షిణాది సబర్మతి’ ఆశ్రమంగా పేరుంది (పల్లెపాడు ఇందుకూరుపేట మండలంలోని గ్రామం). కనకమ్మ వర్ణాంతర వివాహాలు, వితంతు వివాహాలు జరిపించారు. విధి వంచితలైన స్త్రీల అభ్యున్నతికొరకు 1952లో పారిశ్రామిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. మరుపూరివారి ఇంట పుట్టింది – పొణకా వారి ఇంటి కోడలుగా వచ్చింది. రెండు కుటుంబాలకు పేరు ప్రతిష్ఠలు తెచ్చింది. ‘ఆధునిక మహిళలు చరిత్రను తిరగరాస్తారు’ అని చెప్పిన గురజాడవారి మాటలను కనకమ్మ నిరూపించింది. ఆమె తమ్ముడు మరుపూరు కోదండరామిరెడ్డి ‘మందాకిని’ పత్రిక నడిపిన ప్రముఖ సాహితీవేత్త. కనకమ్మ మరణించి (1963) అర్ధశతాబ్దం దాటుతున్నా నెల్లూరు నగరంలోగాని, కస్తూరిదేవి విద్యాలయంలో గాని ఆమె విగ్రహప్రతిష్ఠ నేటికీ జరగకపోవడం విచారకరం.ఆమె స్థాపించిన విద్యాలయం, పల్లెపాడు ఆశ్రమం, నెల్లూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయి. నేడు ఈ ప్రాంతపు ఆడపిల్లలు చదువుల్లో ముందడుగులో ఉండడానికి కారణం ఆనాడు కనకమ్మ వేసిన పునాది. స్త్రీల ప్రగతికి విద్య మౌలికావసరంగా ఆమె ఆ రోజుల్లోనే గుర్తించి ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు.

నెల్లూరు పురమందిర నిర్మాత రేబాల లక్ష్మీనర్సారెడ్డి
నెల్లూరు నడిబొడ్డున ట్రంకురోడ్డు ప్రక్కన సువిశాలమైన స్థలంలో నెల్లూరు పురమందిర నిర్మాణం జరిగింది. టౌన్‌హాలుగా పేరొందిన దీనిని నిర్మించిన ఉదారుడు రావుబహద్దూరు రేబాల లక్ష్మీనరసారెడ్డి. 1915లో భవనం నిర్మిం చినప్పటి నుండి ఇక్కడ సభలు, సమావేశాలు, నాటక ప్రదర్శనలు, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పట్టణానికిది తలమానికంగా ఉంది. దీన్ని తెలియని వారుండరు. అంతగా ప్రఖ్యాతి వహించింది. వర్ధమాన సమాజం ఆఫీసు, పఠన మందిరం ఈ ప్రాంగణంలో ఉన్నాయి.

ఇప్పుడా పురమందిరం స్థలం కోట్లకుకోట్లు విలువ చేస్తుంది.
రేబాల కుటుంబీకులు దాతృత్వం కలిగిన వారు. దానగుణం వారికి వంశ పారంపర్యంగా వచ్చింది. రేబాల పట్టాభిరామరెడ్డి వర్థమాన సమాజ అధ్యక్షులుగా వున్నారు. వారి స్మృతి చిహ్నంగా వారి ధర్మపత్ని సుజాతమ్మ పురమందిర ప్రాంగణంలో విశాలమైన పఠన మందిరాన్ని నిర్మించారు. వారి సోదరుడు రేబాల లక్ష్మీనరసారెడ్డి 1943-47లో మున్సిపల్‌ ఛైర్మన్‌గా, 1957-62లో నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా వున్నారు. దాదాపు 35 సంవత్సరాలపాటు వర్థమాన సమాజ అధ్యక్షులుగా వున్నారు. స్టోన్‌హస్‌పేటలోని రేబాల వారివీధిలోని తమ నివాస భవనాన్ని చిన్నపిల్లల ఆస్పత్రి కిచ్చారు. దాని ప్రక్కనే వున్న మరొక భవనాన్ని పట్టాభిరామిరెడ్డి ధర్మ పత్ని సుజాతమ్మ జిల్లా గ్రంథాలయానికిచ్చారు. నెల్లూరు చరిత్రలో వారి కీర్తి చిరస్థాయిగా నిలి చిపోయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.