కామారెడ్డి, 05 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి గ్రామం, ఒకప్పుడు శిల్ప వైభవం చెదిరిన ఓ ఆంజనేయ ఆలయాన్ని తిరిగి మేల్కొలిపింది. విశ్వహిందూ పరిషత్, బజ రంగ్ దళ్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు ముంద డుగు వేసి ఈ దేవస్థానం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు.నిర్జీవంగా ఉన్న ఆలయం పునరుద్ధరించ బడిన తర్వాత భక్తుల ఉత్సాహం పెరిగింది. కార్తీక పౌర్ణమి రోజు సందర్భంగా స్వామి కృపతో చంద నం పూజ, అభిషేక కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహించ బడ్డాయి. పచ్చబొలు ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. “జై శ్రీరామ్” నినాదాలు గ్రామ గగ నాన్నీ దట్టించా యి.ఈ ఘట్టం కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాదు, ఇది గ్రామ ప్రజల ఏక తా, విశ్వాసం మరియు సంస్కృతికి ప్రతీక. ఒకప్పు డు శిథిలాలుగా మారిన ఈ దేవాలయం ఇప్పుడు ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి దారితీస్తోంది.స్వామి దయతో ప్రతి హృదయం భక్తి మార్గంలో వెలుగొం దాలని గ్రామస్తుల ఆకాంక్ష. కామారెడ్డి భక్తి చరిత్ర ను మరోసారి గర్వంగా నిలిపిన రామారెడ్డి ఈ ప్రయత్నం భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలుస్తుం దని చెప్పడంలో సందేహం లేదు.ఈ కార్యక్రమం లో గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.


