మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి బ్రిటిష్ వలస పాలకులపై విప్లవ శంఖారావం పూరించిన అష్ఫాఖుల్లాఖాన్ 1900 అక్టోబర్ 22న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, షాజహాన్‌పూర్ లోని సంపన్న జమీందారి కుటుంబంలో జన్మించారు. తల్లితండ్రులు మజహరున్నిసా బేగం, షఫీఖుల్లాఖాన్. చిన్ననాటి నుండే మంచి చదువరి అయిన తల్లి నుండి సాహిత్యాభిలాష పెంచుకున్న అష్ఫాఖ్ ఉర్దూ కవిగా రూపొందారు. ఉన్నత పాఠశాలలోని ఎనిమిదవ తరగతి విద్యార్థిగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన పరాయి పాలకుల పట్ల గల వ్యతిరేకతను తన కవితల్లో వ్యక్తంచేశారు. విప్లవోద్యమం పట్ల ఆకర్షితులైన ఆయన ‘హిందూస్దాన్ రిపబ్లికన్ అసోసియేషన్’ అధ్యక్షులు రాంప్రసాద్ బిస్మిల్ పరిచయం కోసం పరితపించారు. ఆర్యసమాజానికి చెందిన బిస్మిల్ తొలుత విప్లవ సంఘంలో అష్ఫాఖ్‌కు సభ్యత్వం ఇవ్వడానికి సంశయించారు. అష్ఫాఖ్ పట్టుదల, విప్లవోద్యమం పట్ల గత నిబద్దత వలన ‘హిందూస్దాన్ రిపబ్లికన్ అసోసియేషన్’లో ఆయనను చేర్చుకోక తప్పలేదు. బిస్మిల్ నేతృత్వంలో జరిగిన పలు యాక్షన్‌లలో అష్ఫాఖ్ చురుగ్గా పాల్గొన్నారు. విప్లవ సంఘానికి ఆయుధాల సమీకరణకు ధనం అవసరం కాగా ప్రభుత్వ ఖజానాను తెస్తున్న రైలు నుండి ధనాన్ని కొల్లగొట్టేందుకు బిస్మిల్ పథకం రూపొందించారు. ఈ పథకం పట్ల అష్ఫాఖ్ తొలుత అయిష్టత వ్యక్తంచేస్తూ ప్రభుత్వ ఖజనాను అపహరిస్తే ఆంగ్ల ప్రభుత్వం సర్వశక్తులతో విప్లవోద్యమం మీద విరుచుక పడగలదని, బాల్యావస్థలో నున్న విప్లవోద్యమం కోలుకోలేనంత దెబ్బ తినగలదని అష్ఫాఖ్ హెచ్చరించారు. చివరకు ప్రజాస్వామిక సిద్ధాంతం పట్ల గౌరవం గల ఆయన సహచరుల మెజారిటీ నిర్ణయానికి సమ్మతి తెలిపారు. 1925 ఆగష్టు 9న కాకోరి గ్రామం మీదుగా వెళ్ళే మెయిల్‌లో తరలిస్తున్న ప్రభుత్వ ఖజానాను కైవసం చేసుకునేందుకు రూపొందిన పథకాన్ని విజయవంతం చేయడంలో అష్ఫాఖ్ ప్రధాన పాత్రను నిర్వహించారు. ఆ సంఘటనతో ఒక్కసారిగా ఖంగుతిన్న బ్రిటిష్ ప్రభుత్వం విప్లవకారుల మీద విరుచుకపడిరది. ‘హిందూస్దాన్ రిపబ్లికన్ అసోసియేషన్’ సభ్యుల అరెస్టులు సాగించింది. అష్ఫాఖుల్లా ఏడాదిపాటు అజ్ఞాత జీవితం గడిపిన పిదప స్వగ్రామానికి చెందిన మిత్రద్రోహి కారణంగా ఢల్లీిలో అరెస్టయ్యారు. ఈ కాకోరి రైలు సంఘటన విచారణ సమయంలో నాయకుడు రాంప్రసాద్ బిస్మిల్‌ను శిక్ష నుండి తప్పించేందుకు ఆయన శతవిధాల ప్రయత్నించారు. కాకోరి రైలు సంఘటనకు పూర్తి బాధ్యత తనదంటూ న్యాయవాది సలహాకు భిన్నంగా ప్రీవికౌన్సిల్‌కు రాతపూర్వకంగా తెలిపారు. అంగ్ల న్యాయస్థానం అష్ఫాఖ్‌కు ఆయన సహచరులు మరో ముగ్గురికి ఉరిశిక్షలు విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఆ ఉరిశిక్ష అమలు కోసం ఎదురు చూస్తూ జైలులో గడిపిన ఆయన ‘నా మాతృభూమి సర్వదా భోగభాగ్యాలతో విలసిల్లాలి… నాదేముంది నేను ఉండొచ్చు, ఉండక పోవచ్చు’ అంటూ ఆకాంక్ష వ్యక్తంచేశారు. చివరకు 1927 డిసెంబర్ 19న ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జైలులో ఉరిశిక్షను ఆనందంగా ఆహ్వానించిన అష్ఫాఖుల్లా ఖాన్ చిరస్మరణీయులయ్యారు.

అమరవీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అష్ఫాఖుల్లా ఖాన్ (1900-1927) 125వ జయంతి