మనుబోలు (పున్నమి విలేకరి) 23, అక్టోబర్ : మనుబోలు మండలంకాగితాలపూరులో శుక్రవారం సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పెన్షన్లు ఇళ్ళస్ధలాలు రైతుభరోసా తదితర ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందుతున్నాయాలేదా అని అడిగి తెలుసుకున్నారు.
ఇళ్ళస్ధలాలు ప్రతిఒక్కరికి అందేలాచూడాలని అధికారులు నుఆదేశించారు
ఈ సందర్భంగా స్ధానిక విలేఖరులతో మాట్లాడుతూ గత టీడిపి ప్రభుత్వంలో పెన్షన్లు మంజూరుకావలంటే సంవత్సరంకు జన్మభూమిసభలు పెట్టి ఇచ్చేవారని వైకాపా ప్రభుత్వంలో నెలకు పెన్షన్ ఒక్కరోజులో రేషన్ కార్డు మంజూరుచేస్తున్నామని ఇదే మా ప్రభుత్వ ప్రత్యేకతన్నారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీలకంటే మిన్నగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారన్నారు.
రైతులకు ఎళ్ళవేళల అందుబాటులో వుండి వారిసంక్షేమం కొరకు పాటుపడుతున్నామన్నారు.
అనంతరం పలుసమస్యలపై అర్జీలను స్వీకరించి సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకముందు గ్రామ యువ నాయకులు, రాజా,రవి దశయ్య ,ఏడుకొండలు ఆధ్వర్యంలో బాణాసంచా బొకే శాలువాలతో ఘనస్వాగతం పలికారు.
ఈ సమీక్షలో ప్రతిలబ్దిదారుని సమస్యలు అడిగితెలుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో హరిగోపాల్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి , భాస్కర్ గౌడ్,శివకుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, గుండాల ఆదినారాయణ, అశోక్ స్ధానిక నాయకులతోపాటు ఎమ్మార్వో ఎంపిడిఓ అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు .ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే కాకాణి
మనుబోలు (పున్నమి విలేకరి) 23, అక్టోబర్ : మనుబోలు మండలంకాగితాలపూరులో శుక్రవారం సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షన్లు ఇళ్ళస్ధలాలు రైతుభరోసా తదితర ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందుతున్నాయాలేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇళ్ళస్ధలాలు ప్రతిఒక్కరికి అందేలాచూడాలని అధికారులు నుఆదేశించారు ఈ సందర్భంగా స్ధానిక విలేఖరులతో మాట్లాడుతూ గత టీడిపి ప్రభుత్వంలో పెన్షన్లు మంజూరుకావలంటే సంవత్సరంకు జన్మభూమిసభలు పెట్టి ఇచ్చేవారని వైకాపా ప్రభుత్వంలో నెలకు పెన్షన్ ఒక్కరోజులో రేషన్ కార్డు మంజూరుచేస్తున్నామని ఇదే మా ప్రభుత్వ ప్రత్యేకతన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలకంటే మిన్నగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారన్నారు. రైతులకు ఎళ్ళవేళల అందుబాటులో వుండి వారిసంక్షేమం కొరకు పాటుపడుతున్నామన్నారు. అనంతరం పలుసమస్యలపై అర్జీలను స్వీకరించి సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకముందు గ్రామ యువ నాయకులు, రాజా,రవి దశయ్య ,ఏడుకొండలు ఆధ్వర్యంలో బాణాసంచా బొకే శాలువాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సమీక్షలో ప్రతిలబ్దిదారుని సమస్యలు అడిగితెలుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో హరిగోపాల్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి , భాస్కర్ గౌడ్,శివకుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, గుండాల ఆదినారాయణ, అశోక్ స్ధానిక నాయకులతోపాటు ఎమ్మార్వో ఎంపిడిఓ అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు .ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.