అన్నదాన సత్రం కు 50,000 విరాళం ఇచ్చిన కుంచా సుధాకర్
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
రైల్వేకోడూరు మండలం, బుడుగుంటపల్లె గ్రామంలో వేలసిన అయ్యప్ప స్వామి ఆలయం ప్రక్కన నిర్మిస్తున్న అన్నదాన సత్రమునకు సింగిరివారిపల్లి వాస్తవ్యులు కీll శేll కుంచా జయరామయ్య, కుంచా వెంకట సుబ్బమ్మ జ్ఞాపకార్థం కుమారుడు కుంచా సుధాకర్ బాబు, కోడలు కళావతమ్మ రూ. 50,000/- ల విరాళమును, ఆలయ ధర్మకర్త, పూజారి అదునుకోట నరసింహస్వామి వారికి అందించారు. వీరికి వీరి కుటుంబానికి ఆ హరి హర సుతుడైన అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవం ఆశీస్సులు ఎల్ల వేళల ఉండాలనికోరుతున్నాను. దాతలు ఇంకా ముందుకు వచ్చి అన్నదాన మండపం నిర్మాణమునకు పూర్తిగా సహకరించ వలసినదిగా కోరుతున్నానని తెలుపుతున్నాను. ఆలయాలు అభివృద్ధి జరగాలంటే భక్తుల సహాయ సహకారాలు ఎంతో అవసరమున్నది. కావున భక్తులు తమకు తోచిన, శక్తి కొలది విరాళములు ఇవ్వవలసినదిగా కోరుతున్నాను.


