అనాధ పిల్లలకు మరియు వృద్ధులకు ఇష్టం సెంట్రల్ స్కూల్ యాజమాన్యం బియ్యం దుస్తులు సహాయం
రైల్వే కోడూరు మేజర్ న్యూస్
రైల్వేకోడూరులోని విస్డం సెంట్రల్ స్కూల్ ఆధ్వర్యంలో తిరుపతి లోని అనాధ పిల్లల మరియు వృద్ధుల కోసం చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం తమ వంతు సహాయం చేస్తున్న విస్డం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కేవలం చదివే కాదు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అనాధలను వృద్ధులను తమకు ఉన్నదాంట్లో సహాయం చేయడం కూడా నేర్పిస్తున్న ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు. ఇది కేవలం ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని అలాగే డిసెంబర్ నెలలో రైల్వే కోడూరులో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలియజేసిన విస్టం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ టి ప్రదీప్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ ప్రియాంక, అడ్మిన్ డైరెక్టర్ మదన్, డీన్ ఇంచార్జ్ ముఖేష్, ఉంగరాల శివ ప్రకాష్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


