*సీపీఐ నేత పముజులకు సోమిరెడ్డి నివాళి*
*నెల్లూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు పముజుల దశరథరామయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
పముజుల దశరథరామయ్య తన జీవితకాలం ప్రజల కోసం పోరాడారు
సౌత్ మోపూరు సర్పంచ్ గా, నెల్లూరు ఎంపీపీగా ప్రజలకు సేవలు అందించారు
అనేక ప్రజా ఉద్యమాల్లో మమ్మల్ని వెనకుండి ప్రోత్సహించారు
జక్కా వెంకయ్య, దశరథరామయ్య, బీజేపీ వరదయ్య లాంటి పెద్దలందరూ సారా వ్యతిరేక ఉద్యమ కమిటీ కన్వీనర్ గా నన్ను పెట్టి నడిపించారు
థర్మల్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు సమయంలో కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీగా ఏర్పడి ఉద్యమం సాగించాం
నేను మొదటి సారి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కనుపూరు కాలువ రూపు మార్చడంలో దశన్న కీలకపాత్ర పోషించారు
దశన్న భౌతికంగా మన మధ్య లేకపోయినా ఉద్యమ స్ఫూర్తిగా జీవితకాలం గుర్తుండిపోతారు

