Wednesday, 12 August 2026
  • Home  
  • వెంకట్రావుపల్లిలో 104 వైద్య సేవలు.. 41 మందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెంకట్రావుపల్లిలో 104 వైద్య సేవలు.. 41 మందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ

ఉదయగిరి మండలంలోని కొండయపాలెం పంచాయతీ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామంలో మంగళవారం 104 మొబైల్ వైద్య సేవల ద్వారా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. మండల వైద్యాధికారిణి డాక్టర్ శివ కల్పన ఆధ్వర్యంలో 41 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. గ్రామస్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.