ఖమ్మం: ఆగష్టు
(పున్నమి న్యూస్)
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం, మంగళవారం ఖమ్మం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు రఘునాథపాలెంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేయనున్నారు.
మంగళవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం నగర పాలక సంస్థ 29వ డివిజన్ పరిధిలో కాటన్ మార్కెట్ నుంచి దంసలాపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొననున్నారు.

