ఖమ్మం
(పున్నమి న్యూస్):
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్య కేసు విచారణలో భాగంగా 28 మందికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణకు నిర్ణీత తేదీల్లో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. గత ఏడాది అక్టోబర్ 31న జరిగిన ఈ హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ నెల 3వ తేదీ నుంచి గుజరాత్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ (NFSU)కి చెందిన తొమ్మిది మంది నిపుణుల బృందం ఖమ్మంలోని సీటీసీ కేంద్రంలో వారం రోజుల పాటు విచారణ నిర్వహించనుంది. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలు, సాంకేతిక అంశాలను పరిశీలించి దర్యాప్తుకు అవసరమైన సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో రామారావు హత్య కేసు విచారణ మరింత వేగం పుంజుకోనుంది.

