संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

యేకొల్లు ప్రజలకు అండగా ఉంటాం – బందిల ఉదయ్ కుమార్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
యేకొల్లు ప్రజలకు అండగా ఉంటాం – బందిల ఉదయ్ కుమార్

खबर की मुख्य बातें

  • *దొరవారిసత్రం మండలం, యేకొల్లు:* యేకొల్లు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
  • యేకొల్లు గ్రామ అభివృద్ధే నా ఏకైక లక్ష్యం.
  • గ్రామంలో పుట్టి, గ్రామంలో పెరిగిన వాడిగా మన గ్రామంలో ఉన్న ప్రతి సమస్య నాకు తెలుసు.

*దొరవారిసత్రం మండలం, యేకొల్లు:*

యేకొల్లు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.

యేకొల్లు గ్రామ అభివృద్ధే నా ఏకైక లక్ష్యం. గ్రామంలో పుట్టి, గ్రామంలో పెరిగిన వాడిగా మన గ్రామంలో ఉన్న ప్రతి సమస్య నాకు తెలుసు. గ్రామ ప్రజల కష్టసుఖాలు నాకు తెలుసు. అందుకే సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను.

*ప్రజలకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.*

నేను గెలిచిన తర్వాత కాదు, ఎప్పుడూ మీ మధ్యనే ఉంటాను. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా నేను ముందుంటాను. పెద్దలకు గౌరవం, యువతకు ప్రోత్సాహం, మహిళలకు భద్రత, రైతులకు అండగా నిలబడటమే నా బాధ్యత.

*నా ప్రధాన లక్ష్యాలు:*

*1. గ్రామ అభివృద్ధి:* యేకొల్లును మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను.

*2. మౌలిక వసతులు:* ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి వీధికి రోడ్డు, ప్రతి వీధికి వీధి దీపాలు.

*3. పారిశుధ్యం:* గ్రామాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతాను.

*4. సంక్షేమ పథకాలు:* అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాను. పేదవాడికి కూడా పంచాయతీ ఆఫీసులో గౌరవం దక్కేలా చేస్తాను.

*5. యువత – విద్య:* యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెడతాను.

కులం, మతం, పార్టీ చూడకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరినీ నా కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేస్తాను.

*11వ వార్డు ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి:*
11వ వార్డు మెంబర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న *కరిమేటి ధనమ్మ* గారిని కూడా ఆశీర్వదించండి. వార్డులోని ప్రతి సమస్యను నా దృష్టికి తెచ్చి, వార్డును అభివృద్ధి చేసే బాధ్యత ఆమె తీసుకుంటారు.

యేకొల్లు గ్రామ పంచాయతీ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వినయంగా కోరుతున్నాను.

*మీ అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించండి*
*మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించండి.*

*సర్పంచ్ అభ్యర్థి – బందిల ఉదయ్ కుమార్ – గుర్తు: మంచం*
*11వ వార్డు మెంబర్ అభ్యర్థి – కరిమేటి ధనమ్మ – గుర్తు: ప్రెషర్ కుక్కర్*
*యేకొల్లు గ్రామ పంచాయతీ – దొరవారిసత్రం మండలం*

समाचार स्रोत

  • Udayप्रेस विज्ञप्ति

Leave a comment

Your email address will not be published. Required fields are marked *