Monday, 10 August 2026
  • Home  
  • భోగాపురం విమానాశ్రయానికి ప్రధాని రాక.. ఏర్పాట్లపై ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ ప్రత్యేక దృష్టి
- అనకాపల్లి

భోగాపురం విమానాశ్రయానికి ప్రధాని రాక.. ఏర్పాట్లపై ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ ప్రత్యేక దృష్టి

అనకాపల్లి జిల్లా, జూలై 31 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ పరిశీలించారు. ఎలమంచిలికి సంబంధించి పార్కింగ్ ప్రాంతాలు, భోజన వసతి, ఇతర మౌలిక సదుపాయాలను రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, కార్యక్రమ పరిశీలకులు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి పరిశీలించారు. విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేస్తూ, పార్కింగ్‌, భోజన వసతి ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అన్నం బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా, జూలై 31 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ పరిశీలించారు. ఎలమంచిలికి సంబంధించి పార్కింగ్ ప్రాంతాలు, భోజన వసతి, ఇతర మౌలిక సదుపాయాలను రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, కార్యక్రమ పరిశీలకులు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి పరిశీలించారు. విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేస్తూ, పార్కింగ్‌, భోజన వసతి ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అన్నం బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.