వార్త ముఖ్యాంశాలు
- పాలేరు అసెంబ్లీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్ పిలుపు తిరుమలాయపాలెం, అక్టోబర్ 7 పున్నమి: తెలంగాణలో దళితులు, బహుజనులపై జరుగుతున్న దాడులు, భూకబ్జాలు, సామాజిక వివక్షకు అగ్రకుల ఆధిపత్య రాజకీయాలే కారణమని బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు అసెంబ్లీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్ అన్నారు.
- మహాత్మా పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాన్యవర్ కాన్షీరాం ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు బహుజనులు రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
- అక్టోబర్ 9న వరంగల్‌లోని ఊర్సుగుట్ట నాని గార్డెన్‌లో కాన్షీరాం వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న “బహుజన రాజ్యాధికార సమరభేరి” కార్యక్రమానికి పాలేరు నియోజకవర్గంలోని అంబేద్కర్ అభిమానులు, సామాజిక ప్రజాస్వామ్యవాదులు, బహుజనులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
పాలేరు అసెంబ్లీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్ పిలుపు
తిరుమలాయపాలెం, అక్టోబర్ 7 పున్నమి: తెలంగాణలో దళితులు, బహుజనులపై జరుగుతున్న దాడులు, భూకబ్జాలు, సామాజిక వివక్షకు అగ్రకుల ఆధిపత్య రాజకీయాలే కారణమని బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు అసెంబ్లీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్ అన్నారు.
మహాత్మా పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాన్యవర్ కాన్షీరాం ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు బహుజనులు రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ 9న వరంగల్‌లోని ఊర్సుగుట్ట నాని గార్డెన్‌లో కాన్షీరాం వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న “బహుజన రాజ్యాధికార సమరభేరి” కార్యక్రమానికి పాలేరు నియోజకవర్గంలోని అంబేద్కర్ అభిమానులు, సామాజిక ప్రజాస్వామ్యవాదులు, బహుజనులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
“ఇకపై ఓట్లు మనవే.. సీట్లు మనవే.. బహుజన రాజ్యాధికారమే మన లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాలేరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొమ్ము పూలే, కార్యదర్శి పోలేపొంగు మల్సూర్, సుబ్లెడ్ సెక్టార్ అధ్యక్షులు ఎల్. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.