పేదల వైద్యానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి.
మైలవరం నియోజకవర్గంలో తాజాగా 146 మందికి రూ.80.38 లక్షల సీఎంఆర్ఎఫ్.
చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు.
ఎన్టీఆర్ జిల్లా. విజయవాడ రూరల్, అక్టోబర్ 10:
ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందడంలో పేద కుటుంబాలు ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అర్హులైన బాధితులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది.
ఇందులో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని వివిధ మండలాలు, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 146 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.80,38,855లు విలువైన వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ చెక్కులు తాజాగా మంజూరయ్యాయి.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్ మండలాలు, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు రీయింబర్స్మెంట్ చెక్కులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సందేశ పత్రాలను అందజేశారు.
మండలాల వారీగా మంజూరైన సహాయం వివరాలు:
జి.కొండూరు: 31 మందికి రూ.18,70,622
విజయవాడ రూరల్: 22 మందికి రూ.11,96,390
కొండపల్లి మున్సిపాలిటీ: 13 మందికి రూ.6,03,199
ఇబ్రహీంపట్నం: 10 మందికి రూ.4,49,464
ఇవికాక మైలవరం మండలంలోని 40 మందికి, రెడ్డిగూడెం మండలంలోని 29 మందికి కూడా సీఎంఆర్ఎఫ్ రీ ఎంబర్స్ మెంట్ చెక్కులు మంజూరయ్యాయి. వీరికి త్వరలోనే చెక్కులు అందజేస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం అప్పులు చేసి ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పాటునందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.
వైద్య సేవల నిమిత్తం ఆర్థిక సహాయం అందించిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తమకు సహకరించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, తదితరులు పాల్గొ

