ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుతూ సంగం మండలం దువ్వూరు గ్రామంలోని శ్రీ శ్రీ దువ్వూరమ్మ తల్లి దేవస్థానంలో జనసేన పార్టీ సంగం మండల సీనియర్ నాయకుడు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసిన నాయకులు, పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవ కొనసాగించాలని అమ్మవారిని ప్రార్థించారు.



