Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేడే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేడే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

వార్త ముఖ్యాంశాలు

  • --ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించిన స్థానిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 5వ తేదీ గురువారం జరగనుంది.
  • ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసి ఉన్నారు.
  • ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

–ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం
ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించిన స్థానిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 5వ తేదీ గురువారం జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసి ఉన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఇక శాంతిభద్రతల విషయంలో పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఉంది. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. నెల్లూరు జిల్లాలో 35 జడ్పీటీసీ స్థానాలు ఉండగా ఇప్పటికే 5 స్థానాలు ఏకగ్రీవమై ఉన్నాయి. కోవూరు నియోజకవర్గంలోనే 3 జడ్పీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమై ఉన్నాయి. కోవూరు నియోజకవర్గ పరిధిలోని కొడవలూరు, బుచ్చి, ఇందుకూరుపేట జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమై ఉన్నాయి.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *