వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు (పున్నమి ప్రతినిధి):రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం (అక్టోబర్ 10) నిర్వహించాల్సిన అనంతసాగరం, సంగం మండలాల పర్యటన రద్దయింది.
- అమరావతిలో అత్యవసర అధికారిక పనుల నిమిత్తం నిర్వహించనున్న ప్రత్యేక కేబినెట్ సమావేశానికి మంత్రి హాజరుకావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం వెల్లడించింది.ఈ పర్యటనలో భాగంగా అనంతసాగరం మండలంలోని పాత దేవరాయపల్లి, పాతాళపల్లి గ్రామాలతో పాటు సంగం మండలంలోని చెన్నవరప్పాడు గ్రామాల్లో మంత్రి పర్యటించాల్సి…
- ఆయా గ్రామాల్లో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.రద్దయిన కార్యక్రమాలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ప్రత్యేక కేబినెట్ సమావేశం నేపథ్యంలో నిర్ణయం
ఆత్మకూరు (పున్నమి ప్రతినిధి):రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం (అక్టోబర్ 10) నిర్వహించాల్సిన అనంతసాగరం, సంగం మండలాల పర్యటన రద్దయింది. అమరావతిలో అత్యవసర అధికారిక పనుల నిమిత్తం నిర్వహించనున్న ప్రత్యేక కేబినెట్ సమావేశానికి మంత్రి హాజరుకావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం వెల్లడించింది.ఈ పర్యటనలో భాగంగా అనంతసాగరం మండలంలోని పాత దేవరాయపల్లి, పాతాళపల్లి గ్రామాలతో పాటు సంగం మండలంలోని చెన్నవరప్పాడు గ్రామాల్లో మంత్రి పర్యటించాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.రద్దయిన కార్యక్రమాలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పర్యటన షెడ్యూల్‌లో మార్పును గమనించి సహకరించాలని కోరారు.