Tuesday, 30 June 2026
  • Home  
  • నితిన్ నబిన్ బహిరంగ సభను విజయవంతం చేయండి: గల్లా సత్యనారాయణ పిలుపు
- ఖమ్మం

నితిన్ నబిన్ బహిరంగ సభను విజయవంతం చేయండి: గల్లా సత్యనారాయణ పిలుపు

ఖమ్మం, జూన్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా రిపోర్టర్ ) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ తెలంగాణ మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి కూడా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సభ విజయానికి సహకరించాలని గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ తెలంగాణ మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి కూడా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సభ విజయానికి సహకరించాలని గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.