Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

*నరసరావుపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..**మార్కెట్ యార్డ్‌లో 600 కేఎల్ వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*నరసరావుపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..**మార్కెట్ యార్డ్‌లో 600 కేఎల్ వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు*
Punnami editorial illustration

వార్త ముఖ్యాంశాలు

  • నరసరావుపేట పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు స్పష్టం చేశారు.
  • నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలోని 9వ వార్డు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో రూ.
  • 149.08 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన 600 కేఎల్ సామర్థ్యం గల రక్షిత మంచినీటి జలాశయాన్ని (ELSR), బూస్టర్ రూమ్‌ను ఆయన గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

నరసరావుపేట పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు స్పష్టం చేశారు.

నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలోని 9వ వార్డు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో రూ. 149.08 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన 600 కేఎల్ సామర్థ్యం గల రక్షిత మంచినీటి జలాశయాన్ని (ELSR), బూస్టర్ రూమ్‌ను ఆయన గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అమృత్ ఫేస్-1 పథకం కింద రూ. 119.81 లక్షల వ్యయంతో 20 మీటర్ల ఎత్తు, 600 కేఎల్ కెపాసిటీ గల ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు.

అలాగే మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ. 19.28 లక్షలు వెచ్చించి బూస్టర్ రూమ్ నిర్మాణం మరియు 20 హెచ్.పి మోటారు పంప్‌సెట్‌ను అమర్చినట్లు వెల్లడించారు. దీనితో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 9.99 లక్షలతో కోటప్పకొండ రోడ్డు నుండి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ వరకు 250 ఎంఎం డీఐ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ పనులను అనుసంధానించామని వివరించారు.

ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో పరిసర ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు సమర్థవంతంగా తీరుతాయని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *