పున్నమి ప్రతినిధి ,తిరుపతి,సిటీ జూలై 28
తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ నూతన ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన జెబి శ్రీనివాస్ మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్‌ను తాడేపల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు జెబి శ్రీనివాస్ మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అంకితభావంతో పనిచేస్తానని, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
మంత్రి నారా లోకేష్ జెబి శ్రీనివాస్‌కు అభినందనలు తెలియజేస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. తిరుమల, తిరుపతి అభివృద్ధి, పార్టీ బలోపేతానికి సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో తిరుపతి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడం తదితర అంశాలపై చర్చించారు.


