మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలో ప్రత్యేక క్యాంప్ సందర్భంగా పోలింగ్ స్టేషన్లను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాచర్ల తహసీల్దార్, మాచర్ల హౌసింగ్ ఏఈ పోలింగ్ స్టేషన్లను పరిశీలించి అక్కడి ఏర్పాట్లను తనిఖీ చేశారు.
ప్రత్యేక క్యాంప్ నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలను తనిఖీ చేసి తగిన సూచనలు చేశారు.


