ప్రైవేటు బడులకన్నా ప్రభుత్వ బడులే మిన్న అని, అన్ని సౌకర్యాలను కల్పించినటువంటి ప్రభుత్వ బడులను సద్వినియోగం చేసుకోండి అని తల్లిదండ్రులను ఉద్దేశించి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు పేర్కొన్నారు.
శుక్రవారం నందలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు మెగా పేరెంట్స్4.0 మీటింగు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు,డ్రగ్స్ కు బానిసలు కాకూడదని పిల్లలను హెచ్చరించారు. అనంతరం కళాశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు, వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
తల్లిదండ్రులకి పాదాభివందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొప్పర్తి శ్రీదేవి, మాజీ ఎంపీపీ పల్లె సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు కొట్టే శ్రీహరి,నందలూరు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు ,విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.




