Friday, 7 August 2026
  • Home  
  • జనగణన గృహ నమోదు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి: తహసీల్దార్ రమాదేవి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనగణన గృహ నమోదు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి: తహసీల్దార్ రమాదేవి

ఈ యొక్క నెల్లూరు జిల్లా జూన్ 3 (పున్నమి ప్రతినిధి) జనగణనలో భాగంగా జరుగుతున్న గృహ నమోదు కార్యక్రమాన్ని ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని తహసీల్దార్ రమాదేవి సూచించారు. బుధవారం మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మనుబోలు మండలం ప్రస్తుతం గృహ నమోదులో పెండింగ్ జాబితాలో మూడో స్థానంలో ఉందని తెలిపారు. గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు, ఖాళీగా ఉన్న గృహాల వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. నమోదు తక్కువగా ఉన్న గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్ఓ కేవీఎస్ గాయత్రి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.

ఈ యొక్క నెల్లూరు జిల్లా జూన్ 3 (పున్నమి ప్రతినిధి)
జనగణనలో భాగంగా జరుగుతున్న గృహ నమోదు కార్యక్రమాన్ని ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని తహసీల్దార్ రమాదేవి సూచించారు. బుధవారం మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మనుబోలు మండలం ప్రస్తుతం గృహ నమోదులో పెండింగ్ జాబితాలో మూడో స్థానంలో ఉందని తెలిపారు. గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు, ఖాళీగా ఉన్న గృహాల వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. నమోదు తక్కువగా ఉన్న గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్ఓ కేవీఎస్ గాయత్రి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.