గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న సీఎం భూపేంద్ర పటేల్ మినహా రాష్ట్ర మంత్రులంతా రాజీనామా చేయగా, నేడు నూతన కేబినెట్ ఏర్పాటు జరిగింది. ఈ క్రమంలో కొత్త మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా ఉన్నారు.
రివాబా జడేజా గత కొంతకాలంగా గుజరాత్‌లో రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆమె బీజేపీ తరఫున జామ్నగర్ నార్త్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని రివాబా జడేజా పదవీ స్వీకార అనంతరం పేర్కొన్నారు.
గుజరాత్ కొత్త మంత్రివర్గం ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వెలుగులోకి వస్తున్నాయి.


