Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కొర్లకుంటలో 50 ఏళ్ల నిరీక్షణకు తెర!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొర్లకుంటలో 50 ఏళ్ల నిరీక్షణకు తెర!

వార్త ముఖ్యాంశాలు

  • కొర్లకుంట: దశాబ్దాలుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న గ్రామ ప్రజల నిరీక్షణకు తెరదించుతూ ఓబులవారిపల్లి మండలం కొర్లకుంట పంచాయతీలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
  • పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి భూమిపూజ నిర్వహించారు.
  • - గ్రామస్థుల్లో హర్షాతిరేకాలు....

కొర్లకుంట: దశాబ్దాలుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న గ్రామ ప్రజల నిరీక్షణకు తెరదించుతూ ఓబులవారిపల్లి మండలం కొర్లకుంట పంచాయతీలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి భూమిపూజ నిర్వహించారు.

– గ్రామస్థుల్లో హర్షాతిరేకాలు….

సుమారు 50 ఏళ్లుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న కొర్లకుంట గ్రామానికి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చిన నాయకులకు పూలమాలలతో స్వాగతం పలికి తమ సంతోషాన్ని తెలియజేశారు. రోడ్డు నిర్మాణంతో రాకపోకలకు ఇబ్బందులు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పనులు దోహదపడనున్నాయి. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *