కుత్బుల్లాపూర్, 24-07-2026(పున్నమి ప్రతినిధి):
మైత్రి నగర్ నూతన కమిటీ సభ్యులు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ వారాల వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు శ్రీ కేపీ వివేకానంద గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కాలనీలోని సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే గారు కాలనీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గట్టు అశోక్ గారుగత 20 సంవత్సరాలుగా మైత్రి నగర్ అధ్యక్షులుగా కొనసాగుతూ మరోసారి కాలనీ నివాసులు అధ్యక్ష పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అధ్యక్షులు గట్టు అశోక్, గారికి. కృతజ్ఞతలు తెలియజేస్తూ……,జనరల్ సెక్రెటరీ కృష్ణ, ట్రెజరర్ ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, హరి నాయుడు, అడ్వైజర్స్ లక్ష్మణ్, వెంకట్ రెడ్డి, మరియు కమిటీ సభ్యులు, స్థానిక బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.



1 Comment
SATHISH
July 24, 2026https://punnami.in/%e0%b0%95%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ac%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af/