కడపలో వైఎస్సార్సీపీ అంగన్వాడీ అధ్యక్షురాలు చైతుల్య జన్మదిన వేడుకలు
కడప, పున్నమి ప్రతినిధి: కడప నగరంలో వైఎస్సార్సీపీ అంగన్వాడీ కడప నగర అధ్యక్షురాలు చైతుల్య జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చైతుల్య కేక్ కట్ చేయగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులంతా కలిసి వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాలతో సందడి చేశారు.
చైతుల్యకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.








