ఉప్పులోని సోడియం నాడీ వ్యవస్థ, కండరాల పనితీరు, శరీరంలో నీటి సమతుల్యతకు అవసరం. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచన ప్రకారం రోజుకు 5 గ్రాములు (ఒక టీస్పూన్) కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. అధిక ఉప్పు వల్ల రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యల ప్రమాదం పెరుగుతుంది. చిప్స్, ఊరగాయలు, ప్యాకెట్ ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వంటల్లో ఉప్పు తగ్గించి, సమతుల ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు.
Uploaded Video:

