ఉపాధ్యాయులకు విద్యార్థుల వీడ్కోలు సందడి… ఘన సన్మానం.
చుంచులూరు ఉన్నత పాఠశాల నుండి బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, ఉపాధ్యాయులు అశోక్, మురళీకృష్ణ, సయీంలకు పాఠశాల వర్గాలు, గ్రామస్తులు ఘనంగా సన్మానం చేశారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తు చేసుకున్న విద్యార్థులు ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టారు. వారి త్యాగం, శ్రద్ధ, బోధన పట్ల నిబద్ధతను ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్ కొనియాడారు.

