संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

ఉదయగిరి ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్ఎం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఉదయగిరి ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్ఎం

ఉదయగిరి ఆర్టీసీ డిపోను నెలవారీ సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం రీజినల్ మేనేజర్ షమీమ్ సందర్శించారు. ఈ సందర్భంగా డిపో నిర్వహణ, అభివృద్ధి పనులు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. డిపో పరిసరాలు, నిర్వహణ తీరును పరిశీలించారు. డిసెంబర్ నాటికి నెల్లూరులో 13, ఉదయగిరి డిపోలో ఒక ఎలక్ట్రిక్ బస్సు ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పర్యావరణహిత రవాణా సేవలను అందించేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోందని పేర్కొన్నారు.

ఉదయగిరి ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్ఎం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *