వార్త ముఖ్యాంశాలు
- సంజామల: ఆన్‌లైన్ ద్విచక్ర వాహన కొనుగోలు వ్యవహారంలో పోలీసులు సత్వరంగా స్పందించి బాధితుడికి న్యాయం చేశారు.
- ఉత్తరప్రదేశ్‌కు చెందిన సత్యం పాండే, ఆల్వకొండకు చెందిన గిరి హుస్సేన్‌తో రూ.40 వేలకు బైక్ కొనుగోలు ఒప్పందం చేసుకుని, ముందస్తుగా రూ.30 వేలు చెల్లించాడు.
- మిగిలిన రూ.10 వేలకు బదులుగా హుస్సేన్ అదనంగా రూ.20 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.సంజామల ఎస్‌ఐ రమణయ్య, కోయిలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ వెంటనే స్పందించి, భాషా సమస్యను అధిగమిస్తూ ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
సంజామల: ఆన్‌లైన్ ద్విచక్ర వాహన కొనుగోలు వ్యవహారంలో పోలీసులు సత్వరంగా స్పందించి బాధితుడికి న్యాయం చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సత్యం పాండే, ఆల్వకొండకు చెందిన గిరి హుస్సేన్‌తో రూ.40 వేలకు బైక్ కొనుగోలు ఒప్పందం చేసుకుని, ముందస్తుగా రూ.30 వేలు చెల్లించాడు. మిగిలిన రూ.10 వేలకు బదులుగా హుస్సేన్ అదనంగా రూ.20 వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.సంజామల ఎస్‌ఐ రమణయ్య, కోయిలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ వెంటనే స్పందించి, భాషా సమస్యను అధిగమిస్తూ ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పూర్వ ఒప్పందం ప్రకారమే మిగిలిన రూ.10 వేలు చెల్లించేలా చూసి, సత్యం పాండేకు వాహనాన్ని అప్పగించారు. సత్వర న్యాయం అందించిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.